Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫీలర్ల ఫ్యాక్టరీ-లింగుస్వామి?

ఫీలర్ల ఫ్యాక్టరీ-లింగుస్వామి?

లింగుస్వామి పేరు లింక్ అవ్వని పెద్ద హీరో వున్నారా టాలీవుడ్ లో ఇటీవలి కాలంగా. ఎప్పుడయితే తమిళ నాట డిజాస్టర్లు వరించి, ఆఫర్లు కరువయ్యాయో అప్పటి నుంచి లింగుస్వామి పేరు తెలుగు హీరోలతో వినిపిస్తూనే వుంది. ముందుగా లింగుస్వామి హీరో నాగార్జునను ట్రయ్ చేసారు. కానీ నాగ్ ఆదిలోనే నో అనేసినట్లు తెలుస్తోంది. 

మహేష్ అపాయింట్ మెంట్ కోసం లింగస్వామి చాలా ట్రయ్ చేసారు. కానీ అసలు అపాయింట్ మెంట్ నే దొరకలేదని వినికిడి. ఆ తరువాత బన్నీ దగ్గర చాలా కాలం కిందా మీదా పడ్డారు. కథ అన్నది చెప్పలేదు కానీ, అసలు అవకాశం కోసమే ప్రయత్నాలు గట్టిగా జరిగాయి. ముఖ్యంగా అరవింద్ తో తమిళనాట లింగుస్వామికి సంబంధాలు వుండడం ఇక్కడ కొంతవరకు కలిసి వచ్చింది. అయినా అక్కడా చాన్స్ మాత్రం కుదరలేదు. ఇక అక్కడ నో చాన్స్ అని తెలిసిపోయాక ఎన్టీఆర్ తో వినిపిస్తోంది లింగుస్వామి పేరు ఇప్పుడు. 

కానీ ఎన్టీఆర్ ఇప్పుడు పక్కా మాస్ మాసాలా సినిమా చేసే మూడ్ లో అస్సలు లేరు. ఫ్యామిలీ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా కావాలని ఆయన ఆలోచన. అందుకు దగ్గర కథ కోసం వెదుకుతున్నారు. ఇలాంటిది లింగుస్వామి దగ్గర సెట్ కానే కాదు. కానీ లింగుస్వామి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారని వినికిడి. ఈ లోగా వినిపించే వార్తలన్నీ లింగుస్వామిని తెలుగులోకి తేవడానికి ప్రయత్నించే కొందరి పుట్టించే గ్యాసిప్ లు తప్ప వేరు కాదని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?