దాదాపు చేతిలో వున్న సినిమాలు అన్నీ దులిపేసాడు హీరో నాగశౌర్య. తరువాత ఏంటీ అన్నది క్వశ్చను. ఆఫర్లు..అగ్రిమెంట్లు అయితే వున్నాయి. సాయి కొర్రపాటికి కొత్త డైరక్టర్ తో ఓ సినిమా చేయాలి. సుకుమార్ వర్క్స్ లో తీసుకున్న అడ్వాన్స్ వుంది. ఎన్నారై లు కొందరు ప్రొడక్షన్ లోకి దిగడానికి రెడీ అయి, నాగ శౌర్యతో ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పటి కిప్పుడు ఇమ్మీడియెట్ గా సెట్ మీదకు వెళ్లేది కానీ, సెట్ మీద వున్నది కానీ ఒక్కటి లేదు.
కళ్యాణ వైభోగమే, జ్యో అచ్యుతానంద లాంటి రెండు మంచి హిట్ లు ఖాతాలో వేసుకున్నాడు. కానీ రెండు కూడా డైరక్టర్ల మూవీలే. ఒకటి నందినీ రెడ్డి, రెండవది అవసరాల శ్రీనివాస్. ఈ రెండింటికి చాలా ఫ్లాపులకు ముందుగా వున్న ఊహలు గుసగుసలాడే కూడా డైరక్టర్ వాల్యూ సినిమానే. బహుశా అందువల్లే కావచ్చు.. ఆ సినిమాలకు హీరో కన్నా డైరక్టర్ కు ఎక్కువ పేరు వచ్చింది. నాగశౌర్య రెమ్యూనిరేషన్ కూడా అలాగే వుండిపోయింది.
దీన్ని బట్టి క్లాస్ డైరక్టర్లు, యూత్ ఫుల్ క్లాస్ ఎంటర్ టైన్ మెంట్లు మాత్రమే నాగశౌర్యకు నప్పుతాయి అని క్లియర్ అయిపోయింది. మరి అలాంటి సినిమాలు వెదుక్కోవాలి. కానీ ఈ తరహా సినిమాలు తీసేవాళ్లు తక్కువ. ఇలాంటి సినిమాలే కావాల్సిన హీరోలు ఎక్కువ. నాని, విజయ్, రాజ్ తరుణ్ ఇలా చాలా మంది వున్నారు. మరి ఇప్పుడు నాగశౌర్య ఎటు వెళ్తాడో..మళ్లీ జాదూగాడు లాంటి మాస్ ప్రయోగాలు చేస్తే మాత్రం గ్రాఫ్ కిందకు జారే ప్రమాదం వుంది.