Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వంశీపైడిపల్లి లైన్ కు మహేష్ ఒకె

వంశీపైడిపల్లి లైన్ కు మహేష్ ఒకె

స్టార్ హీరో మహేష్ పక్కా ప్లాన్డ్ గా వెళ్తున్నారు. సినిమా చేతిలో వుండగానే మరో సినిమా షూటింగ్ కు రెడీ అయిపోతున్నారు. ఆ సినిమా ప్లానింగ్ అలా వుండగానే ఇంకో సినిమాను సెట్ చేసుకుంటున్నారు. మురగదాస్-ఠాగోర్ మధు సినిమా సెట్ మీద వుండగానే, జనవరి నుంచి కొరటాల శివ-డివివి దానయ్య సినిమాను ఓకె చేసి, లైన్లో పెట్టేసారు. 

ఇది అలా వుంచితే గతంలోనే ఒప్పుకున్న పివిపి సినిమాకు కూడా లైన్ ఓకె చేసేసారు. వంశీ పైడిపల్లి ఇటీవలే మహేష్ కు ఎట్ ఎ గ్లాన్స్ స్క్రిప్ట్ చెప్పి ఓకె చేయించుకున్నారట. లైన్ ఎప్పుడో గతంలోనే ఒకె అయింది. ఈ నెలాఖరులో ఫుల్ స్క్రిప్ట్ నెరేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు వంశీ పైడిపల్లి. ఆ నెరేషన్ అయిపోతే, నెలాఖరులోనే ఈ సినిమా అఫిషియల్ ప్రకటన వెలువడే అవకాశం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?