నారా రోహిత్..బేరియాట్రిక్ కు..?

నారా రోహిత్ మంచి నటుడు. వైవిధ్యమైన మంచి సినిమాలు చేసాడు. అయితే మధ్యలో ట్రాక్ కు అటు ఇటు ట్రయ్ చేసి, వైఫల్యాలు చవిచూసాడు. నటుడిగా ఫెయిల్యూర్ కాదు కానీ, ఫిజిక్ విషయంలో మాత్రం…

నారా రోహిత్ మంచి నటుడు. వైవిధ్యమైన మంచి సినిమాలు చేసాడు. అయితే మధ్యలో ట్రాక్ కు అటు ఇటు ట్రయ్ చేసి, వైఫల్యాలు చవిచూసాడు. నటుడిగా ఫెయిల్యూర్ కాదు కానీ, ఫిజిక్ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఇబ్బంది జ్యో అచ్యుతానంద విషయంలో బాగా కనిపించింది. సినిమా చాలా బాగా నటించాడు. సినిమా బాగుంది..అంతా ఒకె. కానీ నారా రోహిత్ కదలికలు కాస్త భారీగా వున్నాయి అన్న కామెంట్ లు వినిపించాయి. 

రోహిత్ బదులు నాని లాంటి యంగ్ హీరో అయి వుంటే, సినిమా ఇంకా డబుల్ సూపర్ హిట్ అన్న మాటలు వినిపించాయి. వినిపిస్తున్నాయి. దీనికి కారణ రోహిత్ నటన కాదు..ఫిజిక్ మాత్రమే. కదలడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్లు సినిమాలో తెలిసిపోతోంది.  గడచిన కొంత కాలంగా తన ఫిజిక్ ను కంట్రోల్ లో పెట్టుకోవాలి నారా రోహిత్ కిందా మీదా అవుతున్నారు. ట్రయినర్ ను పెట్టుకుని ట్రయ్ చేసారు. పది కిలోల వరకు తగ్గారు కూడా. 

అయితే ఇలా తగ్గుతుంటే మళ్లీ అలా మారిపోతోంది ఫిజిక్ అని వినికిడి. దీంతో ఈ ట్రయినర్లు, జిమ్మలు..సరిపోవు అని, ఏకంగా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుని, ఒకేసారి సూపర్ స్లిమ్ అండ్ యంగ్ హీరోగా మారిపోవాలని నారా రోహిత్ ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఎలాగూ అమెరికాలోనే వున్నారు కాబట్టి, అసలు ఈ బేరియాట్రిక్ ప్రోస్..అండ్ కాన్స్ మీద ఓ స్టడీ చేసి, ఆ పైన డెసిషన్ తీసుకుంటారని తెలుస్తోంది.