సంపత్ నందితో కలిసి బెంగాల్ టైగర్ చేసిన తరువాత చక్రి అనే కొత్త డైరక్టర్ తో సినిమా చేయాలుకున్నాడు హీరో రవితేజ. నిర్మాతలుగా చాలా ముందుకు వచ్చి వెనక్కు వెళ్లారు. ఆఖరికి ఆ ప్రాజెక్ట్ అలాగే వుండిపోయింది. ఆఖరికి రవితేజ వేరే డైరక్టర్ తో వేరే ప్రాజెక్టుతో సెట్ అయిపోయారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోందని వినికిడి.
కానీ హీరో రవితేజ కాదు. గోపీచంద్. కొత్త డైరక్టర్ చక్రి తన ప్రాజెక్టుతో సహా గోపీచంద్ చెంతన వాలినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఒకటి రెండు రోజుల్లో ప్రకటన రావచ్చు. ఎందుకంటే ఇంకా హీరోయిన్ ఇతర స్టార్ కాస్ట్ రెడీ కావాల్సి వుంది.