పదిరెట్లు తెచ్చి పెట్టిన పెళ్లి చూపులు

ఒక్కోసారి అదృష్టం..సినిమా రెండు ఒకలాంటివే అనిపిస్తాయి. తంతే బూర్లె గంపలో పడేస్తాయి. పెళ్లి చూపులు అనే చిన్న సినిమా వ్యవహారం ఇలాంటిదే. ఈ సినిమా సంగతి ఇప్పటికే అందరికీ దాదాపు తెలిసిందే. సుమారు్ 80…

ఒక్కోసారి అదృష్టం..సినిమా రెండు ఒకలాంటివే అనిపిస్తాయి. తంతే బూర్లె గంపలో పడేస్తాయి. పెళ్లి చూపులు అనే చిన్న సినిమా వ్యవహారం ఇలాంటిదే. ఈ సినిమా సంగతి ఇప్పటికే అందరికీ దాదాపు తెలిసిందే. సుమారు్ 80 లక్షలతో తీసిన సినిమా. అసలు సినిమాను సంకల్పించినదే, హీరో విజయ్ తొలి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం హిట్ కావడంతో, మరో మంచి సినిమా పడితే బాగుంటుందని. అందుకే విజయ్ బంధువు విదేశాల నుంచి వచ్చి మరీ నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి రంగంలోకి దిగారు. మంచి సినిమా చేసారు. అదృష్టం సురేష్ దగ్గుబాటి రూపంలో తోడయింది. పిచ్చ పబ్లిసిటీ వచ్చేసింది. సినిమా కుమ్మేసింది. 

మొత్తం టోటల్ గ్రాస్ 35 కోట్లకు పైగా వచ్చింది. దీని వల్ల లాభాలు పొందినవారు చాలా మందే వున్నారు. వాళ్లంతా బయ్యర్లు. అది కాక నిర్మాతలుగా రాజ్ కందుకూరు, యాష్ రంగినేని నేరుగా చెరో నాలుగు కోట్లు లాభాలు ఆర్జించుకున్నారు. ఇక చివర్లో పార్టనర్ గా చేరిన సురేష్ బాబు దాదాపు నాలుగు కోట్లు తీసుకోగలిగారు. సురేష్ బాబు డిస్ట్రిబ్యూషన్ లో చిన్న వాటా తీసుకున్న నిర్మాత మధుర శ్రీధర్ కూడా ఒకటో అరో వెనకేసుకోగలిగారు. ఇక ఓవర్ సీస్ బయ్యర్ కు అయితే కాసుల పంటే.

ఇలా ఇంత మందికి పైసలు ఇచ్చిన సినిమా డైరక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పుడు మరోసినిమా రాజ్ కందుకూరికే చేస్తున్నారు. తన షార్ట్ ఫిలిమ్ సైన్మా ను ఫీచర్ ఫిల్మ్ గా మార్చే పనిలోవున్నారు. ఇందులోనూ అందరూ కొత్తవారే.