ఆ హీరోయిన్ కూ ఆ పెద్దాయనకూ..?

ఆమె టాలీవుడ్ లో మంచి పేరున్న హీరోయిన్. ఇప్పుడు ఆఫర్లు తగ్గినా, హీరోయిన్ గా ఆమె స్టామినానే వేరు. ఆమె పెళ్లిపై చాలా కాలంగా గాసిప్ లు వినిపిస్తున్నాయి. కానీ ఏవీ నిజం కాలేదు.…

ఆమె టాలీవుడ్ లో మంచి పేరున్న హీరోయిన్. ఇప్పుడు ఆఫర్లు తగ్గినా, హీరోయిన్ గా ఆమె స్టామినానే వేరు. ఆమె పెళ్లిపై చాలా కాలంగా గాసిప్ లు వినిపిస్తున్నాయి. కానీ ఏవీ నిజం కాలేదు. ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి అనడమే కానీ, అసలు శుభవార్త వినిపించడం లేదు. ఇప్పుడు సదరు హీరోయిన్ పెళ్లిపై ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో మరో గ్యాసిప్ కొత్తగా గుప్పుమంటోంది.

ఆ హీరోయిన్ ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకోబోతోందని. ఇటు రాజకీయ, అటు సినిమా జనాలతో మంచి సంబంధాలున్న ఆ వ్యాపారవేత్త ఈ హీరోయిన్ కు సన్నిహితుడైన ఓ హీరోకు కూడా అత్యంత సన్నిహితుడే. అయితే ఇది నమ్మశక్యంగా లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. 

సదరు వ్యాపారవేత్త కూ, ఈ హీరోయిన్ కూ ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం. టాలీవుడ్ లో చాలా పుకార్లు వినిపిస్తుంటాయి. కొన్ని నిజాలవుతుంటాయి. కొన్ని అలాగే మిగిలిపోతుంటాయి. మరి ఇదేం అవుతుందో చూడాలి.