అవునా..పవన్ తో బోయపాటి నా?

బోయపాటి సినిమా అంటే ఎమోషన్ పీక్ లో వుండాలి. హీరోలు డాల్బీ స్టీరియో సిస్టమ్ లో అదిరిపోయేలా డైలాగులు చెప్పాలి. కానీ ఆ సినిమాల వల్ల హీరోలకు వచ్చే మైలేజీ వేరు. ఇప్పుడు ఆ…

బోయపాటి సినిమా అంటే ఎమోషన్ పీక్ లో వుండాలి. హీరోలు డాల్బీ స్టీరియో సిస్టమ్ లో అదిరిపోయేలా డైలాగులు చెప్పాలి. కానీ ఆ సినిమాల వల్ల హీరోలకు వచ్చే మైలేజీ వేరు. ఇప్పుడు ఆ బోయపాటి ఇచ్చే అదనపు హీరో ఇమేజ్ పవన్ కళ్యాణ్ కు అదనపు పవర్ లా మార్చాలనుకుంటున్నారు దర్శకుడు దాసరి. దీని వెనుకాల పెద్ద స్ట్రాటజీనే వుంది. 

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ముందే బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయడు, ఇంకా అనేక రాజకీయ నేపథ్యపు సినిమాలు చేసారు. 2019 నాటికి పవన్ కళ్యాణ్ కు కూడా ఇలాంటి సినిమా ఒకటి వుండాలని దర్శకుడు దాసరి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఓ సినిమాను పవన్ కళ్యాణ్ తో 2018లో నిర్మించనున్నారు. దానికి సరైన దర్శకుడు బోయపాటి అని దాసరి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు బోయపాటితో దాసరి ప్రిలిమినరీ చర్చలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి ఒక సినిమా చేస్తున్నారు. అది బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా. అది పూర్తి అయిన తరువాత 2017లో మెగాస్టార్ చింరజీవి తో ఓ సినిమా చేసే అవకాశం వుంది. అది పూర్తయిన తరువాత పవన్ తో సినిమా కనుక ఓకె అయితే మెగా కాంపౌండ్ లో మూడేళ్ల పాటు బోయపాటి ఫిక్సయిపోయినట్లే.

పవన్ రాజకీయ రంగ ప్రవేశానికి తన సినిమా పూర్తి సహకారం అందించేలా దాసరి ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగినట్లు అన్ని తరహా ప్రజాసమస్యలు, రాజకీయ అంశాలు కలిగి వుండే కథ గురించి దాసరి జస్ట్ సూక్ష్మంగా బోయపాటికి వివరించినట్లు తెలుస్తోంది. మరి బోయపాటి ఓకె అన్నారా, లేదా అన్నది ఇంకా తెలియలేదు. వన్స్ బోయపాటి ఓకె అంటే పవన్ ను ఓ పవర్ ఫుల్ రోల్ లో చూసే అవకాశం అభిమానులకు కలుగుతుంది.