నాగ్ ఆ టైటిల్ వదలడం లేదు

నిన్నేపెళ్లాడుతా సినిమా నాగార్జున బెస్ట్ మూవీస్ లిస్ట్ లో ఒకటి. అన్నపూర్ణ స్టూడియో పతాకంపై కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ పక్కా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

నిన్నేపెళ్లాడుతా సినిమా నాగార్జున బెస్ట్ మూవీస్ లిస్ట్ లో ఒకటి. అన్నపూర్ణ స్టూడియో పతాకంపై కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ పక్కా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వుంటుంది. హలో బ్రదర్, నిన్నేపెళ్లాడుతా సినిమా సబ్జెక్ట్ లు అన్నా, ఆ టైటిల్స్ అన్నా నాగ్ కు భలే ఇష్టం. 

నాగ్ చైతన్య సినిమాకు నిన్నే పెళ్లాడుతా టైటిల్ వాడతారని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఆఖరికి ఇప్పటికి అది నిజమవుతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తయారయ్యే సినిమాకు ఈ టైటిల్ నే ఫిక్స్ చేసేసారు. ప్రేమమ్ తరువాత నాగ్ చైతన్య చేయబోయే సినిమా ఇదే కావచ్చు. 

దీని తరువాతే విక్రమ్ కుమార్ సినిమా వుంటుంది. అఖిల్ కు, నాగ్ చైతన్యకు ఇద్దరికి కలిపి సూటయ్యే అద్భుతమైన కథను ఎవరైనా చెప్పగలిగితే, నాగ్, ఆ రెండో ముచ్చటయిన, హలో బ్రదర్ టైటిల్ కూడా వాడేస్తారేమో?