తెలంగాణతో సమానంగా ఆంధ్రలో కూడా సినిమా ఫంక్షన్లు చేయడం అన్నది కామన్ అయిపోయింది. అడియో ఫంక్షన్లో, లేదా సక్సెస్ మీట్లో, లేదూ అంటే థియేటర్ విజిట్లో ఇలా ఏదో ఒకటి ఆంధ్రలో కూడా జరుపుతున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు లాంటి సినిమాలు విశాఖలో భారీగా ఫంక్షన్లు నిర్వహించాయి. దాని వల్ల సినిమాల రన్నింగ్ కు కాస్త ప్లస్ అయింది కూడా. అందుకే ఇప్పుడు జనతా గ్యారేజ్ కు కూడా విశాఖలో ఫంక్షన్ చేస్తే ఎలా వుంటుంది అని ఆ సినిమా యూనిట్ ఆలోచిస్తోంది.
రెండోవారం కూడా లాంగ్ వీకెండ్ వస్తోంది. వచ్చే మండే బక్రీద్ పండుగ వుంది. అంటే శని, ఆది, సోమ సెలవులు అన్నమాట. సో, ఈ సెలవులను క్యాష్ చేసుకున్నట్లు వుంటుంది. సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చినట్లు వుంటుంది. అన్నింటికి మించి ఉత్తరాంధ్రలో గ్యారేజ్ కలెక్షన్లు బాగున్నాయి. ఆ మేరకు ఆడియన్స్ కు థాంక్స్ చెప్పుకున్నట్లు వుంటుంది. అన్నీ కలిసి వచ్చేలా వచ్చే ఫ్రైడే అంటే 9న విశాఖలో ఫంక్షన్ చేస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నారు.
కానీ అదే రోజు కాకినాడలో పవన్ సభ వుంది. మరి దాంతో సంబంధం లేకుండా తమ ఫంక్షన్ తాము చేసుకోవాలా? లేక ముందు రోజు చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఇంకో పక్క సరైనోడు మాదిరిగా బీచ్ రోడ్ లో భారీగా చేయాలా? లేకా లిమిటెడ్ గ్యాదరింగ్ తో చేయాలా అన్న ఆలోచన కూడా వుంది. వన్స్ అసలు చేయాలా? వద్దా అన్నది ఫిక్స్ అయ్యాక, మిగిలినవి డిసైడ్ అవుతాయి.