పవన్ ప్రకటనల హడావుడి దేనికోసం?

పవన్ పుట్టిన రోజు సందర్భంగా నాలుగు సినిమాలు రాబోతున్నాయి అనే ఆశను అభిమానులకు కల్పించేలా ప్రకటనలు కనిపించాయి. వాటిల్లో స్వంత బ్యానర్ పై కాటమరాయుడు, హారిక హాసినిపై ఒకటి, దాసరి తారక ప్రభు బ్యానర్…

పవన్ పుట్టిన రోజు సందర్భంగా నాలుగు సినిమాలు రాబోతున్నాయి అనే ఆశను అభిమానులకు కల్పించేలా ప్రకటనలు కనిపించాయి. వాటిల్లో స్వంత బ్యానర్ పై కాటమరాయుడు, హారిక హాసినిపై ఒకటి, దాసరి తారక ప్రభు బ్యానర్ పై ఇంకొకటి వున్నాయి. ఇవి కాక ఎఎమ్ రత్నం సినిమా ఒకటి. ఇలా ప్రకటనలు ఇచ్చి హడావుడి చేయడం వెనుక వేరే రీజన్ వుందని వినికిడి. 

పవన్ మొన్నటికి మొన్న తిరుపతిలో పొలిటికల్ కార్యాచరణ ప్రకటించారు. అయితే సినిమాలు చేస్తాను, రాజకీయాలు చేస్తాను అని ఆయన అక్కడే క్లారిటీ ఇచ్చారు. కానీ సినిమా జనాల అనుమానాలు అలాగే వున్నాయి. ఎందుకంటే రాజకీయ కార్యాచరణ చేయకుండా, సైలెంట్ గా వుంటేనే, ఇంతవరకు పవన్ స్వంత బ్యానర్ సినిమా ఇంచ్ మేరకు కదిలింది. అలాంటిది ఇక రాజకీయ కార్యాచరణ చేస్తూ, సినిమాలు చేయడం అంటే అయ్యే పనేనా అనేది ఆ అనుమానం. 

త్రివిక్రమ్ వేరే వైపు వెళ్లకుండా కాటమరాయుడుతో సమాంతరంగా చేద్దాం అని పవన్ చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ పవన్ పద్దతి తెలిసిన యూనిట్ జనాలు అది పెద్దగా నమ్మడం లేదని వినికిడి. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా అంటే ఆ స్టార్ కాస్ట్, ఆ టెక్నీషియన్స్ వ్యవహారం చాలా భారీగా వుంటుంది. ఈ సినిమా జనాల డేట్లు, ఆ సినిమా జనాల డేట్లు అన్నీ సింక్రనైజ్ కావడం కాస్త కష్టమే.

నిజానికి త్రివిక్రమ్ బలవంతం వల్ల కానీ లేకుంటే ఈ పాటికి హారిక  హాసిని బ్యానర్ పై అల్లు అర్జున్ సినిమా మొదలైపోయి వుండేది. త్రివిక్రమ్ తనకు పవన్ నే కావాలి అని అనబట్టి, ఇప్పుడు ఇలా వుండిపోవాల్సి వచ్చింది.

ఈ విషయం తెలిసి పవన్ సినిమాలోపు త్రివిక్రమ్ ను వేరే హీరోతో సినిమా చేద్దామని బయటి నిర్మాతలు కొందరు రిక్వెస్ట్ చేసున్నట్లు వినికిడి. కొద్ది రోజులు ఆలోచించుకునే సమయం ఇవ్వమని త్రివిక్రమ్ వారిని కోరినట్లు తెలుస్తోంది.

మరి డాలీ, త్రివిక్రమ్ సినిమాలు ఎప్పుడు పూర్తి కావాలి. ఎఎమ్ రత్నం సినిమా ఎప్పుడు మొదలు కావాలి. అంతవరకు ఆ సినిమా కోసం హైదరాబాద్ వచ్చిన తమిళ దర్ళకుడు అలా వెయిటింగ్ లిస్ట్ లో వుండి చివరకు డైరక్షన్ చేస్తారో, లేదా మరో సంపత్ నంది, ఎస్ జె సూర్య మాదిరిగా పక్కకు తప్పుకుంటారో? జనవరి వస్తే, మొదటి సినిమా ముందుకు కదిలితే అప్పుడు తరువాతి వాటిపై క్లారిటీ వస్తుంది.