జనతా గ్యారేజ్ సినిమా ఏమిటి? అమరావతి ఏమిటి అనుకోనక్కరలేదు. అమరావతి నిర్మాణానికి చంద్రబాబు చాలా అద్భుతమైన మాస్టర్ ప్లాన్ వేసి, ఇటు ఫ్రీగా భూములు సంపాదించడమే కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం కూడా సంపాదించే ప్లాన్ వేసారు. ఓ విధంగా ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ బిల్డర్ గా మార్చారు. ఈ వైనాన్ని జనతాగ్యారేజ్ లో టచ్ చేసారు.
జనతా గ్యారేజ్ లో విలన్ 500 ఎకరాల స్లమ్స్ తనకు ఇస్తే, 250 ఎకరాలు డెవలప్ చేసి, ఇళ్లు కట్టించి ఇస్తానని, మిగిలిన 250 ఎకరాలు తాను అమ్ముకుంటానని ప్రభుత్వానికి ప్రతిపాదన పెడతాడు.
అమరావతి స్కీమ్ అచ్చం ఇలాంటిదే. ఇంకా చెప్పాలంటే ఇక్కడ విలనే నయం. ఇళ్లు కట్టించి కూడా ఇస్తా అన్నాడు. కానీ ప్రభుత్వం డెవలప్ చేసిన జాగాలు అది కూడా టెన్ పర్సంటే ఇస్తా అంది. దీనికి ప్రతిపక్షాలు అనేక సందేహాలు వ్యక్తం చేసాయి. మోహన్ లాల్ పాత్ర కూడా సినిమాలో అదే సందేహం వ్యక్తం చేసింది. ముందు సైట్లు అమ్ముకుని ఆపైన ఇళ్లు కడతారా? అన్న మేరకు కట్టకపోతే అని ప్రశ్నిస్తుంది. సుందరమైన భవనాల మధ్య ఇళ్లు వద్దని మళ్లీ అంటారేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇవన్నీ అమరావతి విషయంలో వ్యక్తమైన అనుమానాలే.
మొత్తానికి కొరటాల-ఎన్టీఆర్ కలిసి అమరావతి భూముల స్కీమును తెరపైకి తెచ్చేసారు.