జనతా గ్యారేజ్ చూసిన వారందరికీ మిగిలిన వ్యవహారాలు ఎలా వున్నా, కాజల్ స్పెషల్ సాంగ్ మాత్రం కాస్త గుర్తుంటుంది. అచ్చమైన అయిటమ్ భామలా మారిపోయి, అరకొర డ్రెస్ వేసుకుని, బోలెడు మంది జూనియర్ ఆర్టిస్టుల చేత తనపై చేతులు వేయించుకుని, మరీ డ్యాన్స్ చేసింది కాజల్.
ఇదే మెగాఫ్యాన్స్ కు కాస్త కినుకగా వుందని తెలుస్తోంది. ఎందుకంటే అచ్చమైన అయిటమ్ పాపలా చేసిన కాజల్ త్వరలో మెగాస్టార్ 150 వ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతోంది. అలాంటి ప్రెస్టీజియస్ సినిమా ముందు ఇలాంటి అయిటమ్ సాంగ్ చేయడం ఏమిటి? చీప్ గా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పైగా పోనీ స్పెషల్ సాంగ్ అన్నందుకు కాస్త రిచ్ కాస్ట్యూమ్స్ ఏమన్నా వేసుకుందా అంటే అదీ లేదు. సుకుమార్ సినిమాల్లో అయిటమ్ సాంగ్ లాంటి డ్రెస్సూ..అదే స్టయిల్ పాట..నేను పక్కా లోకల్ అంటూ. మరి ఇప్పుడు ఈ పాపే మెగా స్టార్ పక్కన హీరోయిన్.