ఈస్ట్ గోదావరిలో జనతా గ్యారేజ్ డిస్ట్రిబ్యూటర్లు ఇష్ణా ఎంటర్ ప్రైజెస్ ఓ రేర్ ఫీట్ చేసారు. అమలాపురం, కాకినాడ, మండపేట, రాజమండ్రి, రావుల పాలెం లోని అన్ని థియేటర్లలో తొలి రోజు అన్ని ఆటలు జనతా గ్యారేజ్ నే ప్రదర్శించే ఏర్పాట్లుచేసారు. ఇలా చేయడం చాలా రేర్. బాహుబలికి చేసారు కానీ, కొన్ని ఆటలు మాత్రమే. గ్యారేజ్ అలా కాదు.
అయిదు ఊళ్లలో అన్ని థియేటర్లు, తొలి రోజు అన్ని షోలు ఒకే సినిమా వేసారు. అంటే ఈ అయిదు ఊళ్లలో గురువారం ఎవరైనా సినిమా చూడాలంటే జనతా గ్యారేజ్ మాత్రమే చూడాలన్నమాట. నిజానికి ఈ ఊళ్లలో బాబు బంగారం 70 వేల వరకు, శ్రీరస్తు శుభమస్తు లక్ష వరకు, పెళ్లి చూపులు 40 వేల వరకు షేర్ వస్తోంది.
కానీ గ్యారేజ్ బయ్యర్ ఆయా సినిమాల డిస్ట్రిబ్యూటర్లను, థియేటర్లను రిక్వెస్ట్ చేసి, ఈ రేర్ ఫీట్ జరిగేలా చేసారు. గ్యారేజ్ ను ఈస్ట్ కు నాలుగు కోట్లకు దగ్గరలో కొనుగోలు చేసారు.