కింగ్ కన్ను ఇప్పుడు ఓకె

కింగ్ నాగార్జున బర్త్ డే నేడు. ముందుగా హ్యాపీ బర్త్ డే విసెష్ ఆయనకు. అయితే చాలా మంది నాన్ ఇండస్ట్రీ జనాలకు తెలియని సంగతి ఏమిటంటే, దాదాపు నెల రోజులకు పైగా ఆయనకు…

కింగ్ నాగార్జున బర్త్ డే నేడు. ముందుగా హ్యాపీ బర్త్ డే విసెష్ ఆయనకు. అయితే చాలా మంది నాన్ ఇండస్ట్రీ జనాలకు తెలియని సంగతి ఏమిటంటే, దాదాపు నెల రోజులకు పైగా ఆయనకు ఓ కన్ను బాగాలేదని. కంటిలో వేసుకున్న డ్రాప్స్ రియాక్షన్ ఇవ్వడంతో ఆయన కన్ను ఎర్రగా మారింది. కళ్ల నుంచి ఎక్కువగా నీరు కారింది. అయినా కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ షెడ్యూలు మారకూడదని, అలాగే వెళ్లి, ఓం నమో వెంకటేశాయ  షూటింగ్ లో పాల్గొన్నారు. 

భారీ లైటింగ్ కు మరింత ఇబ్బంది పడ్డారు. కన్ను బాగా లేకున్నా, గ్రాఫిక్స్ లో సెట్ చేద్దామని చెప్పి, అలాగే షూట్ కంప్లీట్ చేసారు. ప్రేమమ్ సినిమా క్లయిమాక్స్ లో వచ్చే చిన్న కామియో రోల్ లో కూడా అలాగే ఎర్రటి కంటితోనే నటించారు. దాన్నీ సిజి లో సరిచేయాల్సి వుంది. ప్రస్తుతం కన్ను బాగానే వుంది. నిన్న మాట్రిక్స్ ప్రసాద్ కుమార్తె వివాహానికి హాజయరయ్యారు. మొత్తానికి కన్ను ఇబ్బంది పెట్టినా డెడికేషన్ తో తన షెడ్యూలు ఎక్కడా దెబ్బతినకుండా చూసుకున్నారు నాగ్.