ప్రేమమ్..నాగ్ చైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లతో తయారైన సినిమా. మళయాలంలో హిట్ అయిన సినిమాను దాదాపు చాలా వరకు అవే ట్యూన్లు, అదే సాంకేతిక వర్గం, అయితే రొమాంటిక్ ఫీల్ వున్న సినిమా ప్రేమమ్. కానీ, భలే భలే మగాడివోయ్ హిట్ అయిన తరువాత నాగ్ ప్రేమమ్ కు కాస్త లైటర్ వీన్ కామెడీటచ్ ఇవ్వమని చెప్పినట్లు వినికిడి. మరి ఆ మేరకు ఏమైనా మార్పులు చేసారా లేదా అన్నది తెలియను.
ఇదిలా వుంటే పూర్తయిన తరువాత ప్రేమమ్ ను నాగ్ చూసారని, కాస్త మార్పులు చెప్పారని తెలుస్తోంది. ఆ మేరకు చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చేసినట్లు వినికిడి. అప్పుడే సినిమాకు అదనపు ఆకర్షణ తేవడం కోసం నాగ్ కూడా క్లయిమాక్స్ లో కామియో రోల్ లో కనిపించాలని డిసైడ్ అయ్యారు. అంతకు ముందు ఒక్క వెంకటేష్ మాత్రమే కామియో రోల్ ఇందులో చేసారు.
ఇప్పుడు ఈ సినిమా ఫలితంపై కాస్త టెన్షన్ నెలకొన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాగ్ చైతన్య ఈ సినిమా కాస్త సరైన చాయిస్ కాదని టాక్ వినిపిస్తోంది. ఫీలింగ్ లు నాచురల్ గా పలకడం కష్టం అని, అయినా ఏదో మేనేజ్ చేసారని తెలుస్తోంది. ఇదే నాని అయి వుంటే ఈ సినిమా రేంజ్ ఎక్కడో వుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. విడుదలైన పాటలు బాగున్నాయి. విజవల్స్ బాగున్నాయి కానీ చైతన్య అంత కరెక్ట్ చాయిస్ నా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
పైగా పక్కాగా ఇది ఎ సెంటర్ల సినిమా. రిజల్ట్ ఏ మాత్రం తేడా వచ్చినా, బి,సిల్లో దీని వంక చూడడం కష్టమైపోతుంది. అదే టెన్షన్ గా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పైగా ప్రేమమ్ కు మొదట్నించి వార్తల పబ్లిసిటీ జరుగుతోంది. అదంతా వెబ్ మీడియలోనూ, సోషల్ నెట్ వర్క్ లోనే. బిసిలకు దూరంగా వుండే జోనర్ లో వస్తున్న సినిమాకు సరైన పబ్లిసిటీ ప్లానింగ్ కూడా కనిపించడం లేదు.
డేట్ పై అనిశ్చితే అందుకు కారణంగా వుంది. ఇప్పుడు డేట్ ఫిక్స్ అయింది కాబట్టి ఏం చేస్తారో చూడాలి. సాధారణంగా నాగ్ చైతన్య తన సినిమాల పబ్లిసిటీని కూడా కాస్త పట్టించుకుంటాడు. కానీ ఈ సినిమా విషయంలో ప్రస్తుతానికి ఇంకా అంతవరకు రానట్లు కనిపిస్తోంది.