జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆయన అభిమానులకు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా సంతోషాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్‌ను ఏకంగా ఆంధ్రప్రదేశ్ సీఎం అంటూ ట్వీట్ చేసింది. దీంతో జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. దాదాపు 15 ఏళ్లు రాజకీయాల్లో ఉండి.. సొంత పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయి రెండు చోట్ల పోటీ చేసిన ఎమ్మెల్యే కూడా కాలేకపోయిన పవన్‌ను ట్వీట్టర్లో సీఎం చేయడంతో ప్రత్యర్థులు ట్రోల్ చేస్తున్నారు.
ఇవాళ 'బ్రో' సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ట్వీట్టర్ వేదికగా. 'ఏపీ గౌరవ సీఎం పవన్ కళ్యాణ్‌తో నటించడం చాలా సంతోషంగా ఉందని.. సినిమా విడుదలకు తన శుభాకాంక్షలు చెప్పుతూ' ట్వీట్ చేసింది. దీంతో ఈమెకు కనీస జనరల్ నాలెడ్జ్ లేదా?.. ఏపీ సీఎం జగన్ అని తెలియదా?.. తెలిసిన నటిస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి ఇన్ని రోజులు తన అభిమానుల చేత సీఎం.. సీఎం అంటూ అనిపించుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా ఓ హీరోయిన్ తో ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ అని అనిపించుకోవడం విశేషం. కాగా పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు.