రకుల్‌ ఎక్సైట్‌మెంట్‌కి కారణం అదేనా.?

మహేష్‌బాబు, మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. ఈ మధ్య సెలబ్రిటీల్లో చాలామంది సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవుతున్నారు. ఆ లిస్ట్‌లో హీరోయిన్‌ రకుల్‌…

మహేష్‌బాబు, మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. ఈ మధ్య సెలబ్రిటీల్లో చాలామంది సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవుతున్నారు. ఆ లిస్ట్‌లో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మిగతా సెలబ్రిటీలకన్నా ముందే వుంటుంది. మహేష్‌ – మురుగదాస్‌ సినిమా షూటింగ్‌లో తొలి రోజు తాను పాల్గొన్న విషయాన్ని చాలా ఎక్సయిటింగ్‌గా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది. 

ఇంతకీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎక్సైట్‌మెంట్‌కి కారణమేంటట.? ఒకటేంటి, రెండు కారణాలున్నాయి. మొదటి కారణం మహేష్‌బాబు. ఆల్రెడీ మహేష్‌తో గతంలో వచ్చిన ఓ అవకాశాన్ని చేజార్చుకోవడంతో, ఈసారి దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పెద్ద హిట్‌ని తన ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది రకుల్‌. రెండో కారణమేంటంటే, మురుగదాస్‌. తమిళ, తెలుగు చిత్రాలే కాకుండా, బాలీవుడ్‌లోనూ మురుగదాస్‌ పాపులర్‌. 

ఇక, మరో కారణం కూడా వుందట రకుల్‌ ఎక్సైట్‌మెంట్‌కి. అదేంటంటే, సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి చాలా ప్రాధాన్యత వుంటుందట. మామూలుగా హీరోయిన్‌ అంటే, గ్లామర్‌ ఒలకబోయడమే. కానీ, ఇందులో హీరోయిన్‌ పాత్ర కోసం కూడా మురుగదాస్‌ చాలానే వర్కవుట్‌ చేశాడట. ఆమె పాత్రలో నటనకు చాలా స్కోప్‌ వుంటుందనీ, అందుకే ఈ సినిమా కోసం రకుల్‌ ఎక్సయిటింగ్‌గా ఫీలవుతోందనీ తెలుస్తోంది.