మన సినిమాలకు మంచి హిందీ మార్కెట్ వుంది. పైగా కాస్త కామన్ జానర్ అయితే హిందీ విడుదల కూడా చేసుకోవచ్చు. అలాంటి అవకాశాలు మరింత పెంచుకోవాలంటే హిందీ నటులను కూడా తీసుకుంటే ఇంకా బెటర్. ఇప్పుడు ఇదే థియరీ, ఇదే స్కీమ్ నడుస్తోంది తెలుగు సినిమాల విషయంలో. దాంతో హిందీ నటులు భారీ రేట్లు చెబుతున్నారు.
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ దేవర సినిమా కోసం సైఫ్ ఆలీ ఖాన్ 14 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే సినిమా కోసం జాన్వి కపూర్ కు నాలుగు కోట్లు ఇస్తున్నారు.
పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్న మృణాల్ ఠాకూర్ మూడు కోట్లకు పైగానే రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు.
లేటెస్ట్ గా పూరి-రామ్ సినిమాలో నటించడానికి సంజయ్ దత్ కు 10 కోట్ల రెమ్యూనిరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద మన వాళ్లకు వాళ్ల క్రేజ్ కావాలి. దాంతో పాటు వచ్చే నాన్ థియేటర్ మార్కెట్ కావాలి. వాళ్లకు మన వాళ్ల మనీ కావాలి. ఉభయకుశలోపరి అనుకోవాల్సిందే.