రవితేజ-అభిషేక్ అగర్వాల్ కాంబినేషన్ లో నిర్మాణమవుతున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా గ్లింప్స్ వదిలారు. ఆసక్తి పెంచారు సినిమా మీద. కానీ తరువాత మళ్లీ అప్ డేట్ లేదు.
రవితేజ ఫ్యాన్స్ పదే పదే ఈ అప్ డేట్ కోసం సోషల్ మీడియాలో అడగడం తప్ప సమాధానం లేదు. లేటెస్ట్ సమాచారం ఏమిటంటే టైగర్ నాగేశ్వరరావు టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఆగస్ట్ ఆరున కానీ కాస్త అటు ఇటుగా కానీ టీజర్ ను విడుదల చేస్తారు.
ఇదిలా వుంటే విడుదల డేట్ మీద కూడా కాస్త అనుమానం వుంది. అక్టోబర్ మూడో వారంలో విడుదల అని గతంలోనే ప్రకటించారు. కానీ అక్టోబర్ 19న రెండు సినిమాలు వస్తున్నాయి. రెండూ భారీ సినిమాలే. ఒకటి అనిల్ రావిపూడి – బాలయ్య – సాహు గారపాటి సినిమా. రెండవది తమిళ డబ్బింగ్.. విజయ్ – లోకేష్ కనకరాజ్ సినిమా. రెండింటి మీద మంచి బజ్ వుంది. ఇప్పుడు ఈ రెండింటితో టైగర్ నాగేశ్వరరావు పోటీ పడుతుందా? డేట్ మారుతుందా? అన్న అనుమానాలు వున్నాయి.
నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాత్రం ముమ్మాటికీ అక్టోబర్ 20న తమ సినిమా విడుదల పక్కా అంటున్నారు. కంటెంట్ ఏది బాగుంటే అది చూస్తారని, ఎన్ని సినిమాలు వచ్చినా ఇదే సూత్రమని అన్నారు. అంటే ఇప్పటికైతే అక్టోబర్ 20నే టైగర్ విడుదల అని అనుకోవాల్సిందే.