జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు

ఎ.పి. కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం లో ప్రభుత్వంచే గుర్తించబడిన జర్నలిజం కోర్సులకు 2016 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నవి: Advertisement క్రమ.సంఖ్య            కోర్సు      …

ఎ.పి. కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం లో ప్రభుత్వంచే గుర్తించబడిన జర్నలిజం కోర్సులకు 2016 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నవి:

క్రమ.సంఖ్య            కోర్సు                                          వ్యవధి           కనీస విద్యార్హత
1                   పి.జి.డిప్లమా ఇన్‌ జర్నలిజం (పిజిడిజె)    12 నెలలు           డిగ్రీ
2                  డిప్లమా ఇన్‌ జర్నలిజం (డిజె)                 6 నెలలు            డిగ్రీ
3                  డిప్లమా ఇన్‌ టీవీ జర్నలిజం(డిటివిజె)       6 నెలలు           డిగ్రీ
4                  సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం(సిజె)        3 నెలలు            ఎస్‌.ఎస్‌.సి

ఈ కోర్సుల్ని రెగ్యులర్‌ గానూ, కరస్పాండెన్స్‌ పధ్ధతి (దూరవిద్య)లోనూ చేయవచ్చు.

తెలుగు లేదా ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.

ప్రవేశం కోరు వారు ప్రవేశ పరీక్ష రాయాల్సి వుంటుంది.
 
ప్రవేశ పరీక్ష- నిబంధనలు

1.ప్రవేశ పరీక్ష దరఖాస్తు ఫారంను, డౌన్‌లోడ్‌ చేసుకుని, హార్ట్‌కాపీ (ఎ4 సైజు కాగితం మీద తీసిన ప్రింట్‌ అవుట్‌) మీద, మీ వివరాలు పూర్తి చెయ్యాలి.
2.’నేనెందుకు జర్నలిజం నేర్చుకుంటున్నాను’ అన్న అంశం మీద, కేవలం పది పంక్తుల్లో ఒక వ్యాసం రాసి మీ దరఖాస్తుకు జత పరచాలి.
3. మీ విద్యార్హత(పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, గ్రాడ్యుయేషన్‌, ఇంటర్మీడియట్‌, లేదా పదవతరగతి)ను ధృవపరిచే ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ తో పాటు, మీ పుట్టినతేదీ ధృవీకకరణ కోసం పదవతరగతి సర్టిఫికెట్ల ఫోటో కాపీ (జిరాక్స్‌)ను ‘సెల్ఫ్‌ అటెస్టేషన్‌’ (మీ సంతకం) చేసి జతపరచాలి.
4. ఏ కోర్సుకు దరఖాస్తు చేస్తున్నారో, అందుకు సంబంధించిన విద్యార్హ త లేని పక్షంలో మీ దరఖాస్తు తిరస్కరణ కు గురవుతుంది.
5.వ్రవేశ పరీక్షకు మీ సొంత ఖర్చులతో హాజరు కావాల్సి వుంటుంది.
6. ప్రవేశ పరీక్ష కు రుసుము ఏదీ వుండదు.
7. ప్రవేశ పరీక్షకు అనుమతి లేదా తిరస్కారం విషయంలో కళాశాల యాజమాన్యానికి పూర్తి హక్కు వుంటుంది.
8. ప్రవేశ పరీక్ష ప్రారంభ సమయం తర్వాత కేవలం 15 నిమిషాల లోపు మాత్రమే పరీక్ష హాలులోకి అనుమతిస్తారు.
9. పరీక్షా కేంద్రానికి కనీసం 30 నిమిషాలు ముందు చేరుకోవాల్సి వుంటుంది.
10. పరీక్షలో ఎంపికయిన వారికి మాత్రమే సీటు రిజర్వ్‌ చేస్తారు. ఆ తర్వాత వారు కౌన్సెలింగ్‌లో హాజరయి అడ్మిషన్‌ పొందాల్సి వుంటుంది. ఆయా కోర్సులకు సంబంధించిన మొదటి వాయిదా అడ్మిషన్‌ ఫీజు, దరఖాస్తు ఫారం ఫీజు సమకూర్చుకుని రావాల్సి వుంటుంది. విద్యార్హత, పుట్టినతేదీలను ధృవపరిచే ఒరిజినల్‌ సర్టిఫికెట్లను, నకళ్ళతో సరిచూసి, కళాశాల అధికారులు, ఒరిజినల్స్‌ను వెనక్కి ఇస్తారు.
11. ప్రవేశ పరీక్షకు డౌన్‌లోడ్‌ చేసిన దరఖాస్తులను కింది అడ్రసుకు కొరియర్‌, స్పీడ్‌ పోస్ట్‌ల ద్వారా మాకు 26 ఆగష్టు 2016 తేదీలోగా ఈ కింది చిరునామాకు పంపాల్సి వుంటుంది. ఎన్వెలెప్‌(కవరు) మీద ‘జర్నలిజం కోర్సుల ప్రవేశ పరీక్ష కోసం’ అని సూపర్‌ స్క్రెబ్‌ (కవరు పైభాగాన రాయాల్సి) వుంటుంది.
12. మీరు పొందుపరచిన ఈ-మెయిల్‌ ద్వారా మీకు ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్‌ అందుతుంది. మీ విద్యార్హతతో పాటు, మీరు పంపిన వ్యాసం ద్వారా మీకున్న ఆసక్తిని బట్టే, మిమ్మల్ని ప్రవేశ పరీక్షకు ఆహ్వానిస్తారు. ఈ విషయంతో తుది నిర్ణయం కళాశాల డైరెక్టర్‌దే. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకూ తావులేదు.
వివరాలకు, 98485 12767, 76609 07286, 040-27608112  నెంబర్లలో సంప్రదించవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: 26 ఆగష్టు 2016
ధరఖాస్తు కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయగలరు : http://apcj.in/download-application-form/
కోర్సు ఫీజు వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. http://apcj.in/courses

డైరెక్టర్‌

ఎ.పి.కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం