మంచు విష్ణుకి నిర్మాతే విలన్

లక్కున్నోడు. మంచు విష్ణు లెటెస్ట్ మూవీ ఆన్ ది సెట్స్. ఆ సినిమా నిర్మాతే హీరో మంచు విష్ణు పాలిట విలన్ లా తయారయ్యాడట.  మరేం కంగారు పడకండి.  అంత ఫైటింగూ లేదు. విలనిజమూ…

లక్కున్నోడు. మంచు విష్ణు లెటెస్ట్ మూవీ ఆన్ ది సెట్స్. ఆ సినిమా నిర్మాతే హీరో మంచు విష్ణు పాలిట విలన్ లా తయారయ్యాడట.  మరేం కంగారు పడకండి.  అంత ఫైటింగూ లేదు. విలనిజమూ లేదు. విషయం ఏమిటంటే, ఆ సినిమా నిర్మాత ఎమ్ వి వి సత్యనారాయణ (విశాఖలో టాప్ బిల్డర్) కు నిర్మాణం కన్నా ఏక్టింగ్ అంటే చాలా ఇష్టం. రెండో సినిమా శంకరాభరణంలో చిన్న పాత్ర కూడా చేసాడు. 

ఇప్పుడు ఆయన నిర్మిస్తున్న మూడో సినిమా ఈ లక్కున్నోడు. ఇందులో ఏకంగా మెయిన్ విలన్ గానే నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే హీరో విష్ణు విలన్ సత్యనారాయణ అన్నమాట.  గీతాంజలి లాంటి హిట్ మూవీ అందించిన రాజ్ కిరణ్ ఈ సినిమాకు దర్శకుడు. మరి ఈ సినిమా తరువాత ఎమ్ వి వి నిర్మాతగా వుంటారో, విలన్ గా ఆ రూట్ లో వెళ్లపోతారో? వెయిట్ అండ్ సీ.