సిక్స్‌ ప్యాక్‌ అన్నాడు.. ఉత్తదేనా.?

నారా వారి హీరో రోహిత్‌ ఆ మధ్య సిక్స్‌ ప్యాక్‌ కోసం ట్రై చేస్తున్నట్లు చెప్పాడు. 'అందుకే వెయిట్‌ పెరుగుతున్నా.. ఆ తర్వాత తగ్గాలి కదా.. ఖచ్చితంగా తగ్గుతా.. సిక్స్‌ ప్యాక్‌లో కనిపిస్తా..' అంటూ…

నారా వారి హీరో రోహిత్‌ ఆ మధ్య సిక్స్‌ ప్యాక్‌ కోసం ట్రై చేస్తున్నట్లు చెప్పాడు. 'అందుకే వెయిట్‌ పెరుగుతున్నా.. ఆ తర్వాత తగ్గాలి కదా.. ఖచ్చితంగా తగ్గుతా.. సిక్స్‌ ప్యాక్‌లో కనిపిస్తా..' అంటూ హామీ అయితే ఇచ్చాడుగానీ, దాన్ని పక్కన పెట్టేసినట్టున్నాడు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో సినిమాల్లోకొచ్చిన నారా రోహిత్‌, అవకాశాలైతే సంపాదించుకుంటున్నాడుగానీ, సరైన హిట్‌ కొట్టడంలోనే.. వెనకబడిపోయాడు. 

ఇక, తాజాగా నారా రోహిత్‌ నటించిన 'జో అచ్యుతానంద' సినిమా టీజర్‌ విడుదలైంది. ఇందులో నాగ శౌర్య స్లిమ్‌గా కనిపిస్తోంటే, నారా రోహిత్‌ మాత్రం ఫ్యాటీ లుక్‌తో కనిపించాడు. రెజినా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. అవసరాల శ్రీనివాస్‌కి దర్శకుడిగా రెండో చిత్రమిది. తొలి సినిమాలానే ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌లా అవసరాల శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 

నారా రోహిత్‌ విషయానికొస్తే, కాస్త వెయిట్‌ తగ్గించి వుంటే నాగ శౌర్యకి మంచి పోటీ ఇచ్చేవాడే. యాక్టింగ్‌ పరంగానూ నారా రోహిత్‌తో పోల్చితే, నాగ శౌర్యకి ఆటోమేటిక్‌గా మార్కులు ఎక్కువే పడిపోతాయి. ఎలా చూసినా, సినిమా సక్సెస్‌ అయితే ఆ క్రెడిట్‌ నాగ శౌర్య ఖాతాలోకే వెళ్ళిపోయే అవకాశముంది. ఇంతకీ, సిక్స్‌ ప్యాక్‌ చేస్తానని చెప్పిన నారా రోహిత్‌, ఎందుకు ఆ విషయాన్ని పక్కన పెట్టేశాడట.?