బాహుబలి 2..బాక్సాఫీస్ హాట్ కేక్. అమ్మకాలు షురూ అయ్యాయి. అయితే రేట్లు ఆకాశంలో వున్నాయి. పార్ట్ వన్ అబ్ నార్మల్ గా వసూళ్లు సాగించింది. అయితే దాని వల్ల బయ్యర్లు లాభ పడ్డారు కానీ, నిర్మాతలు కారు. కానీ పార్ట్ వన్ విజయాన్ని చూపించి, పార్ట్ 2 అమ్మకుని, లాస్ కవర్ చేసుకోవాలని నిర్మాతలు చూస్తున్నారు.
పార్ట్ వన్ ఏ మేరకు కలెక్ట్ చేసిందో, ఆ అమౌంట్ కు కాస్త అటు ఇటుగా రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. దీంతో చాలా మంది బయ్యర్లు వెనకగడుగు వేస్తున్నారు. కొత్తవాళ్లు మాత్రం, ఆశతో రంగంలోకి దిగుతున్నారు. పార్ట్ వన్ ను తమిళనాడుకు తీసుకున్న హీరో ప్రభాస్ స్వంత సంస్థ యువి క్రియేషన్స్ ఈసారి కొత్త రేటు చూసి వెనకడుగువ వేసేసింది.
ఇంత రేటు అంటే కచ్చితంగా రిస్కే అని యువి జనాలు భావించారట. అందుకే అంత రేటు అయితే, వేరే వాళ్లకు ఇచ్చేసుకోమని వదిలేసారు. అంటే తను నటిస్తున్న సినిమా హక్కుల రేటు ఆ సినిమా హీరోకే రిస్క్ అనిపించిందన్న మాట. చూడాలి మరి ఈ జూదంలో నిర్మాతలు గెలుస్తారో? బయ్యర్లు గెలుస్తారో? ఇద్దరు గెలిస్తే అది చిత్రమైన జూదమే అవుతుంది.