నందిని సినిమాలో విజయ్

కళ్యాణ వైభోగమే తరువాత దర్శకురాలు నందినీ రెడ్డికి మళ్లీ ఓ ప్రాజెక్టు సెట్ అయింది. కళ్యాణ వైభోగమే హిట్ అనిపించుకుంది. శాటిలైట్ తో తప్ప నిర్మాతలు గట్టెక్కలేదు. అది వేరే సంగతి. అయితే ఆ…

కళ్యాణ వైభోగమే తరువాత దర్శకురాలు నందినీ రెడ్డికి మళ్లీ ఓ ప్రాజెక్టు సెట్ అయింది. కళ్యాణ వైభోగమే హిట్ అనిపించుకుంది. శాటిలైట్ తో తప్ప నిర్మాతలు గట్టెక్కలేదు. అది వేరే సంగతి. అయితే ఆ సినిమా తరువాత నితిన్ తో సినిమా చేయలని నందినీ రెడ్డి కాస్త గట్టిగానే ప్రయత్నించారు. కానీ ఎందుకనో కుదరలేదు. 

ఆఖరికి పెళ్లి చూపులు హిట్ తో జొరు మీదున్న దేవర కొండ విజయ్ ఓకె అన్నాడు. కళ్యాణ వైభోగమే సినిమాలో నటించిన మాళవిక నాయర్ నే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. కొత్త నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తారు. అయితే ప్రస్తుతం విజయ్ రెండు సినిమాలు చేస్తున్నారు. అవి పూర్తయ్యాకే ఈ సినిమా వుంటుంది. అంటే కాస్త టైమ్ పట్టే వ్యవహారమే.