పొత్తులను మలుపు తిప్పుతున్న వైసీపీ…?

ఏపీలో పొత్తుల కధ ఇంకా ముందుకు సాగడంలేదు. పొత్తు పొడిస్తేనే తప్ప క్లారిటీకి రాదు. ఏపీలో రాజకీయం అంతా ప్రస్తుతం కాస్తా గందరగోళంగానే ఉంది. తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుందా అన్నది మిలియన్ డాలర్…

ఏపీలో పొత్తుల కధ ఇంకా ముందుకు సాగడంలేదు. పొత్తు పొడిస్తేనే తప్ప క్లారిటీకి రాదు. ఏపీలో రాజకీయం అంతా ప్రస్తుతం కాస్తా గందరగోళంగానే ఉంది. తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతోంది.

అదే టైంలో జనసేనకు బీజేపీ పెద్ద పీట వేస్తోంది. బీజేపీ స్ట్రాటజిక్ గా ఏపీ రాజకీయాల మీద ముందుకు అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఈ ఏడాది బీజేపీకి చాలా కీలకమైనది. ఎన్నో ముఖ్యమైన బిల్లులను వరసబెట్టి ఆమోదించుకోవాలని బీజేపీ భావిస్తోంది.

వాటికి రాజ్యసభలో మద్దతు దక్కాలీ అంటే వైసీపీతో ఉండడం తప్పనిసరి. అందుకే బీజేపీ వైసీపీని ఆశ్రయిస్తోంది. వైసీపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీలో పొత్తు రాజకీయాలను కీలక మలుపు తిప్పడానికి తిప్పే అవకాశాన్ని వైసీపీ సొంతం చేసుకుంటోంది.

రాజ్యసభలో వైసీపీకి తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీకి పెద్దల సభలో ఇది చాలా విలువైన సంఖ్యగా ఉంది. బీజేపీ అనేక ప్రాధాన్యతమైన బిల్లులను ఈ ఏడాది కాలంలోనే ప్రవేశపెట్టనుంది. వాటికి తప్పనిసరిగా నమ్మదగిన మిత్రపక్షంగా వైసీపీ ఉంటోంది

దాంతో జాతీయ స్థాయిలో అనూహ్యంగా వైసీపీ ముందుకు వచ్చేసింది. ఇటు ఎన్‌డీఏ అటు ఇండియా పోటా పోటీగా మోహరించిన వేళ తులాభారంగా వైసీపీ నిలవడం మాత్రం అతి పెద్ద చర్చను లేపుతోంది. అలాగే ఏపీ రాజకీయాలలో చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీని పూర్వపక్షం చేసేలా వైసీపీ చురుకుగా పావులు కదుపుతోంది.

ఇక తెలుగుదేశం పార్టీ చూస్తే వ్యూహాత్మకమైన మౌనాన్ని పాటిస్తోంది. ఎందుకంటే ఆ పార్టీకి రాజ్యసభలో ఒకే ఒక్క ఎంపీ ఉన్నారు. ఆ పార్టీ మద్దతు కూడా బీజేపీకి అవసరమే కానీ బీజేపీ ఆలోచనలు ఏమిటి అన్న దాన్ని అంచనా వేసుకుని తన నిర్ణయాన్ని ప్రకటించాలని తెలుగుదేశం భావిస్తోంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే బీజేపీ తెలుగుదేశం పార్టీని ఎన్‌డీఏ భేటీకి పిలవలేదు. ఒక్క జనసేనను మాత్రమే పిలిచి ఒక విధంగా టీడీపీ అవసరం లేదు అన్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. ఇపుడు టీడీపీ వంతు వచ్చినట్లే. ఒక్క ఎంపీ అయినా రాజ్యసభలో టీడీపీ ఓటు కూడా ముఖ్యమే.

ఈ పరిణామాల నేపధ్యం చూసినపుడు తొమ్మిది ఓట్లు ఉన్న వైసీపీని దగ్గర తీసిన బీజేపీ టీడీపీని ఎలా తన వైపునకు తిప్పుకుంటుంది అన్నది కూడా ఆసక్తిని రేపుతోంది. అయితే బీజేపీ ఏపీ పొత్తుల విషయంలో పడుతున్న డైలామాను వైసీపీ సరైన టైం లో అవకాశంగా తీసుకుంది అని అంటున్నారు.

వైసీపీకి 2024 ఎన్నికల్లో గెలవడం ముఖ్యం. దానికి కేంద్రంలోని బీజేపీ న్యూట్రల్ గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఏపీలో పొత్తులు కుదరకుండా ఉంటే వైసీపీ పని మరింత సులువు అవుతుంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఏపీ పొత్తులను బీజేపీ కంటే వైసీపీయే అతి పెద్ద మలుపు తిప్పుతుందా అన్నదే చర్చకు వస్తున్న అంశం.