కొన్ని ప్రాజెక్టులు అంతే. అక్కడిక్కడే గిరికీలు కొడుతుంటాయి. టూ కంట్రీస్ అనే మళయాల సినిమా సంగతి అలాంటిదే. ఈ సినిమా నిర్మాతకు మన తెలుగు దర్శకుడు ఎన్ శంకర్ చాలా మంచి మిత్రుడు. సో, ఆ సినిమా హక్కులు ఎవరికి కావాలన్నా శంకర్ ద్వారా అయితే వీజీ. అయితే అప్పట్లోనే ఈ సినిమా సునీల్ తో చేస్తే ఎలా వుంటుంది అని శంకర్ అనుకున్నాడు.
ఆ మేరకు సునీల్ కు చూపించాడు. అయితే ఇంతలో రంగంలోకి నిర్మాత బండ్ల గణేష్ వచ్చాడు. ఆయనకు సునీల్ ఆనలేదు. వెంకటేష్ తోనా, నాగార్జున తోనా అని ఆలోచించాడు. కాస్త అడ్వాన్స్ కూడా ఇచ్చి హక్కులు తీసుకున్నాడు. ఆ తరువాత బండ్ల ఆలోచనలు చాలా దూరం వెళ్లాయి. టాప్ స్టార్ లు అందరినీ ఆయన టూ కంట్రీస్ లో ఊహించేసుకున్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ ను కూడా అడిగినట్లు వినికిడి. ఏవీ మెటీరియలైజ్ కాలేదు. ఆఖరికి ఆ హక్కులు వదిలించేసుకుందాం అనుకున్నారు. అది కూడా కుదరలేదు. ఇదిలా వుంటే సునీల్ హీరోగా సినిమా నిర్మాంచాలని దర్శకుడు శంకర్ ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం సునీల్ చేస్తున్న రెండు సినిమా పూర్తి కాగానే ఇది మొదలవుతుంది.
సునీల్ తో ఈ టూ కంట్రీస్ సినిమానే రీమేక్ చేస్తారా అన్నది అనుమానం. మంచి డైరక్టర్ వుంటే తనకు ఆ రీమక్ చేయడం లో పెద్దగా అభ్యతరం లేదని సునీల్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.లేదా గతంలో వెంకీతో ఓ సినిమా చేసిన అనుభవంతో ఆయనను అడుగుతారా? అంతా ఓకె కానీ బండ్ల దగ్గర నుంచి శంకర్ హక్కులు వెనక్కు తీసుకున్నారా? లేక ప్రాజెక్టు ఫైనల్ అయ్యాక బండ్ల దగ్గర తీసుకుంటారా? వెయిట్ అండ్ సీ.