దాచుకోవడానికి ఇంకే మిగల్లేదిక.. దశల వారీగా పూర్తి నగ్నచిత్రాన్ని చూపించేసింది రాధికా ఆప్తే. మాస్ కు క్లాస్ కు ఆర్ట్ ఫిల్మ్ కు దూరంగా.. అదేదో జోనర్ లో బాలీవుడ్ వాళ్ల దగ్గరుండి తీస్తున్న సినిమాల్లో రాధిక ఏమాత్రం మొహమాటం లేకుండా.. వీర విజృంభణను కొనసాగిస్తోంది. మొన్నటి వరకూ రాధిక నగ్న రూపం అనేది ఒక స్కాండల్. ఇప్పుడు మాత్రం పూర్తి అధికారికం! ఆమె నగ్న వీడియోలకు యూట్యూబ్ లో బోలెడంత ఆదరణ కనిపిస్తోంది!
బహుశా.. కమర్షియల్ సినిమాలో నటిగా పేరు తెచ్చుకుని.. బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్న తర్వాత ఈ విధంగా తెరపై నగ్న ప్రదర్శన చేసిన నటి రాధిక మాత్రమేనేమో! స్కాండల్స్ ,లీక్డ్ ఎమ్ ఎమ్ ఎస్ లను పక్కన పెడితే.. ఎంజాయ్ చేసే వాళ్లు ఎంజాయ్ చేయదగినట్టుగా, అసహ్యించుకునే వాళ్లు అసహ్యించుకునేలా.. నగ్నంగా నటించేసిన నటిగా రాధిక నిలుస్తోందిప్పుడు.
వెనుకటికి ఎప్పుడో మందాకిని లాంటి వాళ్లు తెరపై మొహమాటానికి సెలవిచ్చినా.. అక్కడ నగ్నత్వం అనేది కావాలని చూపినట్టుగా ఉండదు. కానీ బాలకృష్ణ, రజనీకాంత్ వంటి హీరోల పక్కన నటించి.. ఆ రూట్లో దూసుకపోవడానికి బోలెడంత అవకాశం ఉన్నా, రాధిక మాత్రం ఈ విధంగా దూసుకుపోతోంది!
ఒకవైపు తమ వయసుకు తగిన హీరోయిన్లు దొరక్క తల్లడిల్లుతున్న సౌత్ స్టార్స్ కు రాధిక ఒక ఛాయిస్ అవుతూ వచ్చింది. ఇక రాధికను తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకోవడానికి సౌతిండియన్ హీరోలు ఆలోచనలో పడతారేమో! ‘కబాలి’ సినిమాకు ముందు కూడా రాధిక ఆప్తే నగ్న చిత్రాలు నెట్ లో షికారు చేశాయి. అయితే అది వేరు.
ప్రస్తుతం యూట్యూబ్ లో వీక్షకాదరణ పొందుతున్న ఆమె నగ్న సన్నివేశాలు వేరు. బహుశా అధికారికంగా ఒంటి మీద నూలుపోగైనా లేకుండా కనిపించేసిన ఇండియన్ సినిమా హీరోయిన్లలో సన్నీ తర్వాత రాధికనే స్థానం సంపాదించినట్టే. అయితే సన్నీ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టక ముందు చూపేసింది, రాధిక ఈ దశలో ఊపేస్తోంది. అంతే తేడా!