క్వార్టర్ ఫైనల్స్ లో తన కన్నా బెస్ట్ ర్యాంకర్ పై విజయం సాధించింది పీవీ సింధు. బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో నంబర్ టూ పొజిషన్ లో ఉన్న చైనీ షట్లర్ వాంగ్ యాన్ మీద సింధూ 2-0 సెట్స్ తో విజయం సాధించింది. తద్వారా ఈ తెలుగు అమ్మాయి సెమిస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సెమిస్ లో సింధూ ఒక జపనీ షట్లర్ తో తలపడనుంది.
గురువారం జరిగే ఈ మ్యాచ్ లో గనుక విజయం సాధిస్తే.. పీవీ సింధూకి పతకం కన్ఫర్మ్ అయినట్టే. సెమిస్ లో గెలిస్తే.. ఫైనల్ కు వెళుతుంది కాబట్టి.. స్వర్ణం లేదా రజత పతకాల్లో ఏదో ఒకటైనా సింధూ ఖాతాలో పడుతుంది. తద్వారా రియో లో భారత్ ఖాతా తెరిచినట్టు అవుతుంది.
అంచనాలకు మించి.. ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన చైనీ షట్లర్ పై సింధూ గెలిచిన తీరును చూస్తే.. ఇదే ఫామ్ లో ఆమె దూసుకుపోతే.. స్వర్ణ పతకం సులువే అని చెప్పాలి. క్రితం ఒలింపిక్స్ లో సైనా బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకాన్ని తీసుకొచ్చింది. ఈ సారి సింధూ దూసుకుపోవాలని ఆశిద్దాం.