అఖిల్ రెండో సిన్మానే ఓ పెద్ద సినిమా కథలా తయారైంది. అందులో ట్విస్ట్ లే ట్విస్ట్ లు. లేటెస్ట్ గా విక్రమ్ కుమార్ దర్శకుడిగా ఓ లైన్ ఓకే చేయించకున్నాడు అన్నవార్త బయటకు వచ్చింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ వినిపిస్తోంది. విక్రమ్ కుమార్, అఖిల్ తో సినిమా చేయడం అన్నది ఇప్పుడే కాదట.
విక్రమ్ కుమార్ ముందుగా బన్నీతో సినిమా చేసాకే, అఖిల్ తో చేస్తాడని తెలుస్తోంది. బన్నీ ముందుగా హరీష్ శంకర్ తో సినిమా చేసి, ఆ తరువాత విక్రమ్ కుమార్ సినిమా చేస్తాడట. ఆ సినిమా పూర్తయ్యాకే అఖిల్ తో సినిమా చేస్తా అని విక్రమ్ అంటున్నాడట. అంటే 2017 లో కూడా అఖిల్ – విక్రమ్ కుమార్ సినిమా వుండదన్నమాటే. అంటే అఖిల్ రెండో సినిమా వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చేస్తుందేమో?