మారుతి-వెంకీ కాంబినేషన్ లోని బాబు బంగారం విడుదలయింది. మిక్స్ డ్ రివ్యూల సంగతి ఎలా వున్నా, తొలి వీకెండ్ మూడు రోజులు ప్లస్, ఇండిపెండెన్స్ డే హాలీడే కలపుకుని, 10 కోట్లకు పైగా షేర్ సాధించే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. అయితే అది సరిపోదు. వన్ వీక్ పూర్తిగా ఇదే రేంజ్ లో కలెక్షన్లు వుంటేనే బయ్యర్లు హాపీ. అలా వుంటుందా వుండదా అన్నది మంగళవారం నాటికి కానీ తెలియదు.
ఇదిలా వుంటే హీరో వెంకీ కూడా స్క్రిప్ట్ లో చేతులు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వెంకీ నేరుగా కాకుండా, వేరే విధంగా స్క్రిప్ట్ ను మారుతి అనుకున్నట్లు కాకుండా, మార్పించాడని వినికిడి. సినిమా ప్రారంభంలో కథ చెప్పినపుడు ఓకె అనేసినా, షూట్ పార్ట్ ప్రారంభమైన వన్ వీక్ కే వెంకీ కోటరీకి చెందిన కొందరు వంకలు పెట్టడం ప్రారంభించారని వినికిడి. దాంతో వెంకీ ఆ కోటరీ జనాల సాయంతో స్క్రిప్ట్ ను తన కంట్రొల్ లోకి తెచ్చుకుని, తన చిత్తానికి నడిపించినట్లు తెలిసింది.
దీనికి తోడు నయన తార ఇబ్బంది పెడుతుందని తెలిసినా, ఆమే కావాలని వెంకీ పట్టుపట్టినట్లు తెలుస్తోంది. దీంతో సెకండాఫ్ కు సరైన సాంగ్ లేకుండా అయిపోయింది. మసాలా సినిమా విషయంలో కూడా వెంకీ కోటరీ ఇలాగే చేతులు పెట్టి, ఆ క్యారెక్టర్ ను ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసేలా చేసారు. ఫలితం తెలిసిందే. ఇప్పుడు బాబు బంగారం విషయంలో కూడా అలాంటిదే చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఒరిజినల్ స్క్రిప్ట్ ఇది కాదని, నిర్మాతలకు ఆ విషయంపై క్లారిటీ వుందని, కానీ హీరో మార్చమని చెప్పాక తప్పలేదని తెలుస్తోంది.
యువి, గీతా ఆర్ట్స్ లో మారుతి సినిమా చేయడం వేరు, వెంకీతో చేయడం వేరు. అక్కడే తేడా వచ్చినట్లు వినికిడి.