న్యూడ్ సీన్లను చాలా లైట్ తీసుకుంటుంది బాలీవుడ్ భామ రాధికా ఆప్టే. 'అందులో కళాత్మకతని మాత్రమే చూడండి..' అంటూ ఉచిత సలహాలు ఇస్తూనే, చూడాలనుకుంటే ఇంకో కోణంలోనూ చేసుకోండి, చెత్త కామెంట్లు మాత్రం వెయ్యకండి, వేశారో మీ ఖర్మ.. అనడం రాధికా ఆప్టేకి వెన్నతో పెట్టిన విద్య.
'ధోనీ', 'రక్తచరిత్ర' సినిమాల్లో చూసిన అమ్మాయేనా ఈ రాధికా ఆప్టే.? తెలుగు, తమిళ సినీ జనాలకి ఆశ్చర్యం కలగకమానదు, ఇంటర్నెట్లో ఆమె నగ్న వీడియోల్ని చూస్తే. ఫేస్ చాలా పద్ధతిగా కనిపించినా, రాధికా ఆప్టే చాలా మోడ్రన్ భావాలున్న నటి. సినిమా హిట్టవుతుందా? ఫట్టవుతుందా? అని ఆలోచించదు, సినిమా చెయ్యాలనుకుంటే చేసేస్తుందంతే. ఆమెను సినిమా కోసం ఒప్పించడమూ పెద్ద కష్టం కాదట. ఒక్కసారి ఒప్పుకున్నాక, కథ ప్రకారం న్యూడ్ సీన్స్ వున్నా సరే 'అబ్జెక్షన్' వుండదట ఆమె నుంచి.
రాధికా ఆప్టే ఎందుకిలా చేస్తోంది.? అని ఎవరూ తనను క్వశ్చన్ చేయకూడదంటుందామె. దటీజ్ రాధికా ఆప్టే. ఇప్పుడు తాజాగా ఈమె గురించిన చర్చ ఎందుకంటే, ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం రాధికా ఆప్టే నటించిన 'పర్చెద్' సినిమాలో కొన్ని సీన్స్ ఒకటొకటిగా ఇంటర్నెట్లో లీక్ అవుతున్నాయి. ఇది గతంలోనే టొరంటో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమయ్యిందనుకోండి.. అది వేరే విషయం.
మామూలుగా అయితే సెన్సార్ బోర్డ్, సినిమాల్ని సెన్సార్ చేసేస్తుంటుంది. అక్కడికీ కటింగుల విషయంలో నానా రాద్ధాంతం జరుగుతోంది. ఇంటర్నెట్కి అయితే సెన్సార్ లేదు కదా. అందుకే, విచ్చలవిడిగా ఇంటర్నెట్లో బూతు సినిమాల్ని రిలీజ్ చేసేసినట్లు, రాధికా ఆప్టే న్యూడ్ వీడియోల్ని లీక్ చేసేస్తున్నారు. సినిమా పాతదే, కానీ ఎవరూ చూడలేదు. అందుకే సినిమా సంగతి దేవుడెరుగు, సీన్లను క్యాష్ చేసుకుందామని 'పర్చెద్' సినిమా యూనిట్ భావిస్తున్నట్లుంది. వారి వ్యూహం ఫలించి, బాగానే యవ్వారం గిట్టుబాటయ్యేలా వుంది.
కామెడీ ఏంటంటే, ఇప్పుడు రిలీజ్ అయిన వీడియో కంటే హాట్ వీడియో కొన్నాళ్ళ క్రితమే విడుదలయ్యింది. అదింకా జుగుప్సాకరం.