గుంటూరు కారం ఎప్పటి వరకు?

త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్‌లో రెడీ అవుతున్న సినిమా గుంటూరు కారం. వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఆఖరికి మొదలైంది. ఈ సినిమా ఇప్పుడు ఏ స్టేజ్ లో వుంది అన్నది ఫ్యాన్స్…

త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్‌లో రెడీ అవుతున్న సినిమా గుంటూరు కారం. వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఆఖరికి మొదలైంది. ఈ సినిమా ఇప్పుడు ఏ స్టేజ్ లో వుంది అన్నది ఫ్యాన్స్ ఆసక్తి. అక్టోబర్ నెలాఖరుకు టాకీ పూర్తి చేసి, నవంబర్, డిసెంబర్ ల్లో నాలుగు పాటలు షూట్ చేస్తామని గతంలోనే నిర్మాత చెప్పారు. కానీ ఇప్పటి పరిస్థితి ఏమిటి? 

యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే.. టాకీ పార్టీ నవంబర్ నెలాఖరుకు పూర్తవుతుంది. ఇందులోనే ఓ మాంటేజ్ సాంగ్, ఓ డ్యూయట్ చిత్రీకరణ కూడా వుంటుంది. డిసెంబర్ లో రెండు పాటల చిత్రీకరణ వుంటుంది. మొత్తం మీద డిసెంబర్ 15 కు చిత్రీకరణ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వుంటుంది

గుంటూరు కారం సినిమాకు స్టార్ కాస్ట్ ఎక్కువ. కాంబినేషన్ సీన్లు ఎక్కువ. మొదట్లో లాక్ చేసిన డేట్ లు అన్నీ వృధా అయిపోయాయి. అందువల్ల మళ్లీ అందరి దగ్గరా డేట్ లు తీసుకోవాల్సి వచ్చింది. ఇలా తీసుకోవడంలో అందరి డేట్ లు సెట్ కావడం అన్నది సమస్య అవుతోంది. దాంతో కాంబినేషన్ సీన్లు లేట్ అవుతున్నాయి. వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తోంది. దాని వల్ల షూటింగ్ అనుకున్నట్లు జరగడం కష్టం అవుతోంది.

ప్రస్తుతానికి వున్న ప్లానింగ్ సంక్రాంతి విడుదలకు పెర్ ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ ప్లానింగ్ లో కనుక ఒకటి రెండు వారాలు తేడా వస్తే మాత్రం కష్టం అవుతుంది. గుంటూరు కారం సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. సినిమాకు భారీగా ఖర్చు చేస్తున్నారు. అదే మాదిరిగా భారీగా మార్కెట్ చేస్తున్నారు. అందువల్ల సంక్రాంతి విడుదల అన్నది గుంటూరు కారం సినిమాకు అత్యంత అవసరం.