మొదటి నుంచీ కత్రినా కైఫ్ 'కత్తి' లాంటి అందాలతో కైపెక్కిస్తూనే వుంది. గ్లామర్‌లో ఎప్పుడూ కత్రినాకైఫ్ రాజీ పడలేదు. ఫిజిక్ మెయిన్టెనెన్స్లోనూ కత్రినాకైఫ్ మిగతా హీరోయిన్లకు ఎప్పుడూ సవాల్ విసురుతూనే వుంది. అలాంటి కత్రినాకైఫ్‌కి, వున్నపళంగా ఇంకా ఎందుకు సన్నబడాలన్పించినట్లు.? బాలీవుడ్లో ఇప్పుడు ఇదే ఎవరికీ అర్థం కావడంలేదు.
ఆల్ మోస్ట్ జీరో సైజ్ ఫిజిక్‌కి కత్రినాకైఫ్ చేరుకుంది. మామూలుగా ఈ తరహా ఫిజిక్ కోసం ట్రై చేస్తే, మొహంలో షేప్స్ మారిపోతాయి. మొత్తం శరీరమంతా ఎముకల గూడులా తయారైపోతుంది. కానీ, కత్రినాకైఫ్ విషయంలో అలాంటివేమీ జరగలేదు. మునుపటిలానే కన్పిస్తోందామె. కాస్త సన్నబడిందంతే. కాస్త కాదు, చాలానే సన్నబడింది. ఇంతలా సన్నబడ్డానికి ఏం చేసిందో.? అన్న ప్రశ్నకు కత్రినా సమాధానం దాచుకోలేదు.
రెగ్యులర్ ఎక్సర్సైజ్లతోపాటు, స్విమ్మింగ్ కాస్త ఎక్కువగా చేసిందట కత్రినాకైఫ్. అంతకు మించి, తాను సన్నబడ్డం వెనుక సీక్రెట్ ఏమీ లేదని చెబుతున్న కత్రినా, తగినంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, ఫేస్‌లో గ్లో చెడిపోకుండా సన్నబడటం సాధ్యమేనని చెప్పుకొచ్చింది. అయితే, డాక్టర్ పర్యవేక్షణలోనే ఇదంతా చేయాల్సి వుంటుందనీ, లేకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతోంది కత్రినా కైఫ్.
ప్రస్తుతం కత్రినాకైఫ్ నటించిన 'బార్ బార్ దేఖో' సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో కత్రినా మునుపటికన్నా చాలా నాజూకుగా కన్పిస్తోంది. ఆ నాజూకుదనం మరింతగా ఎక్స్పోజ్ అయ్యేందుకుగాను, చాలీ చాలని కాస్ట్యూమ్స్.. అవి కూడా శరీరానికి అంటి పట్టేసుకునేలా కాకుండా కాస్త వదులుగా డిజైన్ చేయించుకుంది కత్రినాకైఫ్. 'బార్ బార్ దేఖో'లో కత్రినా కాస్ట్యూమ్స్ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టించేస్తున్నాయి మరి.