సినిమా జనాలకు మా సెంటిమెంట్లు లావుగా వుంటాయి. హీరోకి, డైరక్టర్ కి, నిర్మాతలకు ఇలా ఎవరివి వారికి. అందుకే సినిమా విడుదలకు ముందు ఏవేవో చేస్తుంటారు. బాబు బంగారం సినిమా నిర్మాత సంగతి అలా వుంచితే దర్శకుడు మారుతికి నమ్మకాలు కాస్త ఎక్కువే. పైగా పూజలు, పురస్కారాలు కూడా కాస్త ఎక్కువే.
అందుకే బాబు బంగారం సినిమాను నిన్నటికి నిన్న అంటే సోమవారం రాత్రే ఓ షో వేసేసుకున్నారు. తొమ్మిది మంది దగ్గరి జనాలు టికెట్ లు కొని మరీ సినిమాను చూసేసారు. అంటే శాస్త్ర ప్రకారం సినిమా విడుదల అయిపోయినట్లే అన్నమాట. ఇలా చూసిన వాళ్లలో నిర్మాతలు చినబాబు, వంశీ, ఇంకా వారి బంధువులు, మారుతి సన్నిహితులు వున్నారట. అవును.
మరి అంత మంచి ముహుర్తం అనుకంటే 12 కు బదులు 8నే విడుదల చేసి వుంటే..? అక్కడ మళ్లీ ఇండస్ట్రీ సెంటిమెంట్ శుక్రవారం ఒకటి వుంది. అయినా శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం..బంగారం విడుదల..భలే కలిసి వచ్చిందేమో?