ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాగా మారిపోతున్నాయి ఇప్పుడు. పైగా హిందీ డైరెక్ట్ రిలీజ్ కావచ్చు, హిందీ రైట్స్ అమ్మకం కోసం కావచ్చు. మల్టీ స్టారర్ గా మారుస్తున్నారు తెలుగు సినిమాలను.
కీలకమైన పాత్రలకు తమిళ, మలయాళ, హిందీ నటులను తీసుకువస్తున్నారు. దర్శకుడు పూరి కూడా తన సినిమాలకు ఎంచి ఎంచి నటులను తీసుకువస్తూ వుంటారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా లో ఓ కీలకపాత్రకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంజయ్ దత్ పది కోట్ల భారీ రెమ్యూనిరేషన్ అడిగారని, దానికి పూరి-చార్మి కూడా ఓకె అన్నారని టాలీవుడ్ వర్గాల బోగట్టా. రామ్-పూరి కాంబినేషన్ కు, ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ కు మంచి క్రేజ్ వుంది. కచ్చితంగా మంచి మార్కెట్ వుంటుంది. అలాంటపుడు సంజయ్ దత్ ను తీసుకుంటే అది ఇంకా పెరుగుతుంది.
ఈ సినిమాకు హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఫైనల్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను పూరి-చార్మి తమ స్వంత బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.