పవన్‌కళ్యాణ్‌కి కథ దొరికిందోచ్‌

పవన్‌కళ్యాణ్‌ తాజా సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళిందంటూ ప్రచారం జరుగుతున్న వేళ, కొత్తగా పవన్‌కళ్యాణ్‌ సినిమాకి కథ దొరకడమేంటట.? ఇదే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌. నిజమే మరి, కథ కుదరక పవన్‌కళ్యాణ్‌…

పవన్‌కళ్యాణ్‌ తాజా సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళిందంటూ ప్రచారం జరుగుతున్న వేళ, కొత్తగా పవన్‌కళ్యాణ్‌ సినిమాకి కథ దొరకడమేంటట.? ఇదే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌. నిజమే మరి, కథ కుదరక పవన్‌కళ్యాణ్‌ కిందా మీదా పడ్డాడు. ఎస్‌జె సూర్య చెయ్యాల్సిన సినిమా ప్రస్తుతం డాలీ చేస్తున్నాడు. ఆ కథా, ఈ కథా ఒకటేనా.? అసలు ఈ సినిమా కథేంటి.? ఇలా రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్న వేళ, కొందరు ఔత్సాహికులు సినిమాకి టైటిల్‌ పెట్టేశారు, కథ కూడా చెప్పేస్తున్నారు. 

ఇక, గాసిప్స్‌లో విన్పిస్తున్నదాన్ని బట్టి పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న సినిమా పేరు 'కడప కింగ్‌'. సినిమా కథేంటంటే, యంగ్‌ పవన్‌కళ్యాణ్‌ ఓ అమ్మాయిని లవ్‌ చేస్తాడట. ఆ తర్వాత కొన్ని కారణాలతో, లేటు వయసులో మళ్ళీ ఇంకో హీరోయిన్‌కి ఎట్రాక్ట్‌ అవుతాడు. ఇదీ కథ. మరీ, సోషల్‌ మీడియాలో అభిమానులకి క్రియేటివిటీ ఎక్కువైపోతోంది కదూ.! 

ఏం చేస్తాం, కథ కాకరకాయ ఏమీ లేకుండా సినిమాలు సెట్స్‌మీదకు వెళ్ళిపోతున్నాయనే ఊహాగానాలు విన్పిస్తున్నవేళ అభిమానులే, ఏదో ఒకటి అనేసుకోవాలి కదా. 'ఏటీ, సినిమాలు చూడట్లేదేటీ.. ఇంతే కథ..' అనేస్తున్నారు నెటిజన్లు. అదిరిందయ్యా నెటిజన్లూ.. అనుకోవాలేమో.! 

ఇంతకీ, పవన్‌కళ్యాణ్‌ – డాలీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కథేంటట.? ఇది ఓ తమిళ సినిమాకి రీమేక్‌ అన్న ప్రచారం నిజమేనా.? అసలు టైటిల్‌ ఏమనుకుంటున్నారు.? ఏమో, పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజునాటికి ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నాల్లో వున్న చిత్ర దర్శక నిర్మాతలు, అప్పటికల్లా కాస్తయినా సస్పెన్స్‌ని రివీల్‌ చేస్తారేమో వేచి చూడాల్సిందే.