మెలానియా క్నావ్స్ అలియాస్ మెలానియా ట్రంప్.. ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో 'హాట్' టాపిక్ అయ్యింది. ఆమె ఒకప్పుడు మోడలింగ్ రంగంలో పనిచేసింది. అప్పటి ఫొటోలు ఇప్పుడు హాట్ హాట్‌గా చర్చనీయాంశమవుతున్నాయి. కారణం, మెలానియా, అమెరికా అధ్యక్ష పదవికి తలపడ్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య కావడమే.
భర్తతో కలిసి ఎన్నికల ప్రచారంలో అడపా దడపా కన్పిస్తున్న మెలానియా గురించి అమెరికా రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె మోడలింగ్ రోజులనాటి ఫొటోల్ని సోషల్ మీడియాలో గిరగిరా తిప్పేస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఈ ఫొటోలతో సోషల్ మీడియా వేదకిగా తలపడ్తుండడం గమనార్హం.
మెలానియా న్యూడ్ ఫొటోలంటూ మార్ఫింగ్ ఫొటోలతోనూ డోనాల్డ్ ట్రంప్‌ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఇదంతా డెమోక్రాట్ల అబ్యర్థి హిల్లరీపై జరుగుతున్న దుష్ప్రచారమేననే వాదనా లేకపోలేదు. హిల్లరీ తరఫున ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని రిపబ్లికన్లు ఆరోపిస్తోంటే, ఆ అవసరం తమకు లేదని డెమోక్రాట్లు తెగేసి చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడి భార్యని అక్కడ ఫస్ట్ లేడీ అనడం మామూలే. ఆ లెక్కన, ఫస్ట్ లేడీగా ఈ హాట్ బ్యూటీనా.? పైగా న్యూడ్ లేడీనా.? అంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారంతో డోనాల్డ్ ట్రంప్ విపరీతంగా ఇబ్బంది పడుతున్నారట. మామూలుగా అయితే డోనాల్డ్ ట్రంప్ నోరు తెరిస్తే కంపు.. ఆయన నోట అలాంటి డైలాగులు వస్తాయి మరి. కానీ, తన భార్య విషయంలోనే నోరు మెదపలేకపోతున్నాడు.
డోనాల్డ్ ట్రంప్ అంటే అమెరికా అధ్యక్ష రేసులో వున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థే కాదు.. అక్కడ అపర కుబేరుడు కూడా. ఆయనకి మెలానియా మూడో భార్య. 2005 నుంచి మెలానియా, డోనాల్డ్ ట్రంప్ మధ్య వైవాహిక బంధం కొనసాగుతోంది.