మెగా టైటిల్‌.. అభిమానులదే ఛాయిస్‌.?

చిరంజీవి కొత్త సినిమాకి టైటిల్‌ ఏం పెట్టాలి.? అన్న కన్‌ఫ్యూజన్‌ కొనసాగుతోంది. దర్శకుడు వినాయక్‌ అయితే 'కత్తిలాంటోడు' అనే టైటిల్‌కి ఫిక్సయ్యాడు. నిర్మాత రామ్‌చరణ్‌ మాత్రం అదేమీ అంత యాప్ట్‌గా లేదంటున్నాడు. దాంతో, 'కత్తిలాంటోడు'…

చిరంజీవి కొత్త సినిమాకి టైటిల్‌ ఏం పెట్టాలి.? అన్న కన్‌ఫ్యూజన్‌ కొనసాగుతోంది. దర్శకుడు వినాయక్‌ అయితే 'కత్తిలాంటోడు' అనే టైటిల్‌కి ఫిక్సయ్యాడు. నిర్మాత రామ్‌చరణ్‌ మాత్రం అదేమీ అంత యాప్ట్‌గా లేదంటున్నాడు. దాంతో, 'కత్తిలాంటోడు' టైటిల్‌ పక్కకి వెళ్ళింది. ఈలోగా అభిమానులు ఊరుకుంటారా.? తమ అభిమానాన్ని చాటుకుంటూ తమకు తోచిన టైటిల్స్‌ని డిజైన్‌ చేసేసుకుని మరీ, సోషల్‌ మీడియాలో సందడి చేసేస్తున్నారు. 

'ఖైదీ నెంబర్‌ 150' అనే టైటిల్‌ చాన్నాళ్ళుగా మీడియా సర్కిల్స్‌లో నానుతోంది. కొత్తగా 'నెపోలియన్‌' అనే టైటిల్‌తో కూడిన డిజైన్‌ తెరపైకొచ్చింది. ముందు ముందు ఇంకా చాలా టైటిల్స్‌ రానున్నాయి. అయినా, చిత్ర యూనిట్‌ నుంచి టైటిల్‌ మీద ఎలాంటి కన్‌ఫర్మేషన్‌ లేదు. ఆ మాటకొస్తే, అసలు హీరోయిన్‌ ఎవరన్నదాని మీదనే ఇంకా క్లారిటీ లేకపోవడం గమనార్హం. 

ఇదో పబ్లిసిటీ జిమ్మిక్కు అనుకోవాలో, లేదంటే టైటిల్‌ దొరక్క హీరోయిన్‌ ఫైనల్‌ కాక చిత్ర యూనిట్‌ ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే వుందని అనుకోవాలో అర్థం కాని పరిస్థితి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చిరంజీవి కొత్త సినిమా పట్టాలెక్కింది. ఆ పట్టాలెక్కడంలోనూ అనేక బాలారిష్టాలు తప్పలేదు. ఇప్పుడేమో టైటిల్‌ చుట్టూ ఇంత గందరగోళం. హీరోయిన్‌ విషయంలోనూ కన్‌ఫ్యూజన్‌. ఎందుకిలా.? అంటే, చరణ్‌ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. 

పరిస్థితి చూస్తోంటే, టైటిల్‌ విషయంలో అభిమానులదే ఛాయిస్‌లా వుంది. సోషల్‌ మీడియాలో అభిమానులు చేస్తున్న సందడి నుంచి ఓ టైటిల్‌ని 'పిక్‌' చేయాలనే ఆలోచనలో వున్నాడేమో నిర్మాత రామ్‌చరణ్‌. టైటిల్‌ విషయం సరే, హీరోయిన్‌ మాటేమిటి.?