అల్లు అర్జున్‌ని ‘గంగోత్రి’లో చూసి మెగా అభిమానులే నీరసించిపోయారు. అయితే రెండో సినిమానే ఆర్య రావడం, ఆ తర్వాత మంచి దర్శకులని నమ్ముకుంటూ నెమ్మదిగా ఒక్కో మెట్టూ ఎక్కి అతను పెద్ద స్టార్ అయిపోయాడు. అల్లు అరవింద్ ప్లానింగ్, బ్రెయిన్స్ తోడయితే ఎవరైనా నిలబడిపోగలరనే నమ్మకాన్ని పెంచాడు.
మొదట్లో నిర్మాత అవుదామని అనుకున్న అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ కూడా హీరోగా మెప్పించడానికి చాలా కష్టాలు పడుతున్నాడు. తమ కుటుంబంలో అందరూ పెద్ద స్టార్లే కావడంతో చిన్న డ్జెట్ సినిమాలకో హీరో ఉండాలన్నట్టు శిరీష్‌ని అరవింద్ ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే అర్జున్‌లా రెండో సినిమాకే అతనికి యాక్సెప్టెన్స్ రాలేదు.
ప్రతి సినిమా మధ్య చాలా గ్యాప్ తీసుకుంటోన్న శిరీష్ ఇపడు ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో ఇంకోసారి అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. లుక్స్ పరంగా చాలా ఛేంజ్ అయితే కనిపిస్తోంది కానీ ఇప్పటికీ ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు. శిరీష్ తర్వాత వచ్చిన మెగా హీరోలని ఓన్ చేసుకున్న అభిమానులు ఇతడిని ఇంకా పట్టించుకోవడం లేదు. మరి మాస్టర్ బ్రెయిన్ అల్లు అరవింద్ తన చిన్న కొడుకుని కూడా సేలబుల్ హీరోగా నిలబెట్టగలరో లేదో చూడాలి.