రిజెక్టెడ్ స్క్రిప్ట్ కు దగ్గుబాటి ఓకెనా?

ఫ్యాషన్ డిజైనర్..ఉరఫ్ లేడీస్ టైలర్ 2 ఈ సినిమాపై వచ్చినన్ని గ్యాసిప్ లు మరే సినిమా మీద రాలేదేమో? తనికెళ్ల అద్భుతమైన స్క్రిప్ట్ తయారుచేసారన్నది తొలి గ్యాసిప్. కానీ నిజం ఏమిటీ? ఏ స్క్రిప్ట్…

ఫ్యాషన్ డిజైనర్..ఉరఫ్ లేడీస్ టైలర్ 2 ఈ సినిమాపై వచ్చినన్ని గ్యాసిప్ లు మరే సినిమా మీద రాలేదేమో? తనికెళ్ల అద్భుతమైన స్క్రిప్ట్ తయారుచేసారన్నది తొలి గ్యాసిప్. కానీ నిజం ఏమిటీ? ఏ స్క్రిప్ట్ లేదు. కాన్సెప్ట్, టైటిల్ మాత్రం అల్లరి నరేష్ కోసం నిర్మాత అమ్మిరాజు అలా అట్టే పెట్టారు. దాన్ని మధుర శ్రీధర్ తీసుకుని, డైరక్టర్ వంశీకి, హీరో రాజ్ తరుణ్ కు అడ్వాన్స్ ల ఇచ్చారు. కానీ ఏమయింది? స్క్రిప్ట్ వంటకం పూర్తి కాలేదు. 

ఫుల్ కథ చెబితేనే సెట్ మీదకు అంటారు రాజ్ తరుణ్. అలా ఫుల్ కథ చెప్పడం అన్నది వంశీకి కుదరలేదు. దాంతో రాజ్ తరుణ్ నో అనేసే పరిస్థితి. అప్పుడు మచ్చ రవి రంగంలోకి వచ్చి స్క్రిప్ట్ రెడీ చేసారని వినికిడి. కానీ అది కూడా రాజ్ తరుణ్ కు నచ్చలేదు. స్క్రిప్ట్ బాగుంటేనే చేస్తా, లేదంటే లేదు అని నిర్మొహమాటంగా చెప్పేసాడు రాజ్ తరుణ్. మరి అలాంటి స్క్రిప్ట్ ను దగ్గుబాటి సురేష్ కొడుకు అభిరామ్ హీరోగా చేసేస్తున్నారని మళ్లీ గ్యాసిప్ లు. 

రాజ్ తరుణ్ స్క్రిప్ట్ బాగా లేదు అన్నాడంటే, అక్కడ ఏదో పాయింట్ వుండి వుండాలిగా? మరో పక్క ఎంత మంచి డైరక్టర్ అయినా వంశీ ఫార్మ్ లో లేరుగా. మరి లోపాలున్న స్క్రిప్ట్, ఫార్మ్ లో లేని డైరక్టర్  చేతిలో సురేష్ తన కొడుకును పెడతారా? నమ్మే విషయమేనా? అభిరామ్ హీరోగా మధుర శ్రీధర్ సినిమా చేస్తే చేయచ్చు గాక, కానీ ఇలాంటి రిజెక్టెడ్ స్క్రిప్ట్, ఆల్ మోస్ట్ రిటైర్డ్ డైరక్టర్ తో అభిరామ్ సినిమా వుంటుందా? 

ఇదే నిజమైతే చైతన్య లాంచింగ్ లో నాగ్ చేసిన తప్పిదాలే, దగ్గుబాటి సురేష్ తన కొడుకు లాంచింగ్ లో చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుందేమో?