తమన్నా-సంపత్ నంది హ్యాట్రిక్ మిస్సయిపోయింది. తమన్నా డేట్లు అడ్జస్ట్ కాలేదు. పైగా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కావాల్సి వచ్చింది. దాంతో ఈక్వేషన్లు కూడా కుదరలేదు. ఆఖరికి హన్సిక, కేథరిన్ థెరిస్సా ఎంపికయ్యారు. గోపీచంద్ సరసన ఈ ఇద్దరు హీరోయిన్లను కన్ ఫర్మ్ చేసారు.
సంపత్ నంది డైరక్షన్ లో భగవాన్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సరైన హీరోయిన్ దొరికితే సంపత్ నంది తెరమీద అందాలు ఆరబోయించేస్తారు. తమన్నా విషయంలో అలాగే జరగింది. మరి ఇప్పుడు ఇద్దరు దొరికారు. ఇద్దరికిద్దిరు అందాల ఆరబోతలో ఎటువంటి మొహమాటలు లేని వాళ్లే.
అందునా ఇప్పుడు హన్సిక కాస్త బరువు తగ్గించుకుని మరింత సన్నబడింది. సో, ఇక జనాల కళ్లు తెరపై గోపీచంద్ మీద కంటే ఈ ఇద్దరిమీదే వుంటాయి. రచ్చ, బెంగాల్ టైగర్ తరువాత సంపత్ నంద్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా ఇది.