'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో అనసూయ చేసింది ఐటమ్ సాంగే. జస్ట్ స్పెషల్ సాంగ్ లాంటిదంతే. దాంతోపాటు, ఓ రెండు డైలాగులు. అంతకు మించి, ఆ సినిమాలో అనసూయకి పెద్దగా పాత్ర దక్కింది లేదు. 'క్షణం' సినిమాతో మాత్రం అనసూయ బాగానే మార్కులు కొట్టేసింది. అయినాసరే, అనసూయని ఏదో 'లోటు' వెంటాడుతోంది.
ఓ పక్క రష్మి అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటోంటే, 'సరైన అవకాశాల కోసం' అనసూయ ఎదురుచూపులతోనే సరిపెట్టాల్సి వస్తోంది. అందుకే, అనసూయ ఇప్పుడు కెరీర్లో వేగం పెంచాలనుకుంటోందట. ఐటమ్ సాంగ్ అని కాదుగానీ, 'సోగ్గాడే చిన్ని నాయనా' తరహాలో స్పెషల్ సాంగ్ దక్కితే చెయ్యడానికి రెడీగా వున్నానంటోందిట అనసూయ. ఆ దిశగా అనసూయ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే, రెమ్యునరేషన్ విషయంలోనూ అనసూయ 'బెట్టు' చేయడం, రష్మి కాస్త వెసులుబాటు కల్పిస్తుండడం.. ఈ కారణంతోనే అనసూయ కంటే రష్మికి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. విషయం పసిగట్టిన అనసూయ, రెమ్యునరేషన్ వ్యవహాల్ని పూర్తిగా పక్కన పెట్టేసిందట. మరి, ఇంతలా అనసూయ తనను తాను మార్చేసుకుందిగానీ.. ఆమె ఆశించిన స్థాయిలో కెరీర్ వేగం పుంజుకుంటుందా.? వేచి చూడాల్సిందే.