నిహారికకి బ్రేక్‌ ఇచ్చేదెవరు.?

'మెగా హీరోయిన్‌' అనే గుర్తింపు ఆటోమేటిక్‌గా దక్కేసినా, సక్సెస్‌ అంత ఈజీగా దొరకదు కదా.! తొలి సినిమా రిలీజ్‌కి ముందు విపరీతమైన పబ్లిసిటీ పొందిన నిహారిక, తీరా సినిమాలో చూస్తే సూపర్‌ డల్‌గా కనిపించింది.…

'మెగా హీరోయిన్‌' అనే గుర్తింపు ఆటోమేటిక్‌గా దక్కేసినా, సక్సెస్‌ అంత ఈజీగా దొరకదు కదా.! తొలి సినిమా రిలీజ్‌కి ముందు విపరీతమైన పబ్లిసిటీ పొందిన నిహారిక, తీరా సినిమాలో చూస్తే సూపర్‌ డల్‌గా కనిపించింది. దాంతో నిహారికని అంతా లైట్‌ తీసుకున్నారు. బుల్లితెరపై సరదా సరదాగా కన్పించిన నిహారికని వెండితెరపై ఆడియన్స్‌ చూడలేకపోయారన్నది నిర్వివాదాంశం. 

ఇప్పుడు వున్నపళంగా నిహారికకి మంచి బ్రేక్‌ కావాలి. అదెలా.? ఇదే ఇప్పుడు ఆమెను వేధిస్తోన్న ప్రశ్న. మెగా ఫ్యామిలీ నుంచే ఎవరో ఒకరు ఆమెకు బ్రేక్‌ ఇవ్వాలి. ఆ బ్రేక్‌ ఎవరిస్తారన్నది ఇంకో ప్రశ్న. అల్లు అర్జున్‌ లేదా చరణ్‌లలో ఎవరో ఒకరు తమ సినిమాలో ఓ 'మంచి పాత్ర' ఇస్తే బాగుంటుందన్నది నిహారిక ఆలోచన. ఆ దిశగా ప్రయత్నాలూ జోరుగా సాగుతున్నాయట. 

'డాడీ (పెదనాన్న చిరంజీవిని డాడీ అనే పిలుస్తుంది నిహారిక) సినిమాలో నటించాలని వుంది. నా కోసం కొత్తగా ఏ పాత్రా క్రియేట్‌ చెయ్యక్కర్లేదు. ఏదో ఒక చిన్న పాత్రలో ఛాన్స్‌ ఇస్తే చాలు..' అంటూ ఆ మధ్య మీడియా సాక్షిగా చిరంజీవి కొత్త సినిమా దర్శకుడు వినాయక్‌కి బిస్కట్‌ వేసింది నిహారిక. ఇప్పుడేమో, ఎలాగైనా తనకు ఛాన్స్‌ ఇప్పించాలని తండ్రి నాగబాబు చెవిలో 'పోరు' పెడుతోందట. 

ఇదిలా వుంటే, నిహారిక ఓ హిందీ సినిమాని తెలుగులోకి రీమేక్‌ చేద్దామనే ఆలోచనలో వుందట. అదో థ్రిల్లర్‌ మూవీ. తెలుగులో ఇప్పుడు కామెడీ థ్రిల్లర్స్‌కి మంచి క్రేజ్‌ వుంది. అలాగని అన్ని కామెడీ థ్రిల్లర్స్‌ ఆడెయ్యడంలేదు మరి. ఏంటో, హీరోయిన్‌గా దూసుకెళ్ళిపోతాననుకున్న మెగా హీరోయిన్‌కి ఈ మెగా కష్టాలు.!