బాలీవుడ్‌కి వెళ్ళిపోయిన ఒకప్పటి టాలీవుడ్ భామ ఇలియానా, బాలీవుడ్ కబుర్ల గురించి కథలు కథలుగా చెబుతోంది. చీమ చిటుక్కుమంటే చాలు, దాని చుట్టూ స్టోరీ అల్లేస్తోంది ఇల్లీ బేబ్. 'అమ్మో, బాలీవుడ్‌కి వెళ్ళాక ఇలియానా ఇలా తయారైందేంటి.?' అని జనం నోరెళ్ళబెట్టాల్సి వస్తోంది ఆమె చేష్టల కారణంగా.
అసలు విషయమేంటంటే, ఇలియానా గుర్రమెక్కింది. వేరే అర్థం వెతక్కండి. ఇలియానా నిజంగానే గుర్రమెక్కింది. కానీ, ఆ గుర్రం ఒక్కసారిగా గుస్సా అయ్యింది. అంతే, ఇలియానా కంగారుపడిపోయింది. అక్కడే వున్న బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్, వెంటనే ఆ గుర్రాన్ని అదుపు చేశాడు. ఇంకేముంది, ఇలియానా హ్యాపీస్. ఈ విషయాన్నే పెద్ద కథ అల్లి మరీ ఇలియానా బోల్డంత సందడి చేసేస్తోంది.
అయినా, ఇలియానాకి గుర్రమెక్కడం ఇదే కొత్తేమీ కాదు. 'ఆట' సినిమాలో ఇలియానా గుర్రమెక్కింది. ఆ సినిమాలో హీరోగా సిద్దార్ధ నటించాడు. ఇంకొన్ని సినిమాల్లోనూ ఇలియానా గుర్రపు స్వారీ చేసేసింది. అరేబియన్ గుర్రంలా కనిపించే ఇలియానాకి గుర్రమంటే భయమా.? ఛాన్సే లేదు. ఇంతకీ, ఇలియానా – అక్షయ్‌కుమార్ 'గుర్రం' కహానీ ఏ సినిమా గురించో తెలుసా.? 'రుస్తుం' గురించి. ఆగస్ట్ 12న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
అన్నట్టు, ఇలియానా గుర్రమెక్కి కంగారుపడటం, గుర్రాన్ని అక్షయ్‌కుమార్ కంట్రోల్ చేయడం.. ఇదంతా రియల్‌గా వుంటుందని, సినిమా షూటింగ్లో భాగం కాకపోయినా, సినిమాలో వుంచేస్తున్నారట. అదీ అసలు విషయం. పబ్లిసిటీ కోసం సినీ జనాలు చేసే స్టంట్‌లో ఇదీ ఓ భాగమే. ఇంకో విశేషమేంటంటే, అక్షయ్‌కుమార్ తనకు గాడ్ ఫాదర్ లాంటోడనీ, ఆయనతో వర్క్ చేస్తోంటే సమయమే తెలియడంలేదనీ, డేరింగ్ అండ్ డాషింగ్ అక్షయ్‌తో మాంఛి యాక్షన్ పిలిం ఒకటి చేయాలని వుందనీ ఇలియానా చెబుతోంది. ఇల్లీ బేబ్, అక్షయ్‌కుమార్‌కి బాగానే లైనేస్తున్నట్టుంది కదూ.!