కబాలి తెలుగువెర్షన్ కు లాభమే

కబాలి సినిమా తెలుగు వెర్షన్ భయంకరమైన రేటు చెప్పినపుడు అమ్మో అనుకున్నారంతా. కొత్త బయ్యర్లు తొలిసారి స్టేట్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చి దాన్ని ఆ రేటుకే కొన్నపుడు, చూద్దాం అనుకున్నారంతా. ఆఖరికి ఇప్పుడు…

కబాలి సినిమా తెలుగు వెర్షన్ భయంకరమైన రేటు చెప్పినపుడు అమ్మో అనుకున్నారంతా. కొత్త బయ్యర్లు తొలిసారి స్టేట్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చి దాన్ని ఆ రేటుకే కొన్నపుడు, చూద్దాం అనుకున్నారంతా. ఆఖరికి ఇప్పుడు విడుదల దగ్గరకు వచ్చేసరికి వాళ్లు టేబుల్ ప్రాఫిట్ స్టేజ్ కు వచ్చేసారని తెలిసాక, అమ్మో కబాలీ..అనుకుంటున్నారు. 

కబాలి తెలుగు వెర్షన్ 32 కోట్లు చెప్పారు నిర్మాత థాను. ఆఖరికి అది 30కి సెటిల్ అయినట్లు తెలుస్తోంది. అయితే మళ్లీ తెలుగు శాటిలైట్ కూడా తామే చేసుకుంటామని, దానికింద ఓ ఆరు కట్ చేసేసారు. అంటే 24కు కిట్టింది. ఇప్పుడు నైజాం 8.5 కు, సీడెడ్ 6.5 కు, ఆంధ్ర 10కి ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే కోటి లాభం వచ్చేసినట్లే.

కానీ ఆంధ్ర అంతకన్నా ఎక్కువే అని మరో వెర్షన్ వినిపిస్తోంది. నైజాం రేటు ఎక్కువ రాలేదు కానీ, ఆంధ్ర 13 వరకు వచ్చిందని మరో టాక్. ఆ టాక్ ఎలా వున్నా ఈ రేట్లతో కూడా కబాలి తెలుగు వెర్షన్ నిర్మాతలు సేఫ్. పైగా ప్లస్ పాయింట్ ఏమిటంటే పబ్లిసిటీకి ఎక్కువ ఖర్చు చేయాల్సి రాకపోవడం. ఇప్పటికే భయంకరమైన బజ్ వచ్చింది. అందువల్ల ప్రీ పబ్లిసిటీ అక్కరలేదు. పోస్టు పబ్లిసిటీ చూసుకోవచ్చు. 

నైజాం ఓవర్ ఫ్లోస్ ఫిఫ్టీ ఫిప్టీ అని అగ్రిమెంట్ కుదిరిందని వినికిడి. సినిమా హిట్ అయితే నైజాంలో ఎనిమిదిన్న కోట్లు రావడం పెద్ద సమస్య కాదు. అందువల్ల ఆ విధంగా కూడా రెవెన్యూ వచ్చే అవకాశం అయితే వుంది. సరే లాభాల సంగతి ఎలా వున్నా, ఆ రేటుకు ఓ డబ్బింగ్ సినిమా కొని సేఫ్ కావడం గొప్ప విషయం కదా.