దర్శకుడు బోయపాటిపై అదనపు భారం పడింది. ఇన్నాళ్లు టాప్ హీరోలతోనే సినిమాలు చేసారు. ఈయన కొంత బండి లాగితే, వాళ్ల మరికొంత లాగేవారు. కానీ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా. ఏమాత్రం తనకంటూ చరిష్మా లేని హీరో. అందువల్ల మొత్తం దమ్ము అంతా స్క్రిప్ట్ లోనే వుండాలి. అందుకే బోయపాటి కిందా మీదా అవుతున్నారట. ఎలాగైనా పెర్ ఫెక్ట్ స్క్రిప్ట్ తో సెట్ మీదకు వెళ్లాలని చూస్తున్నారు.
అంతే కాదు, ఇక్కడ ఇంకో సమస్య కూడా వుంది. సరైనోడు సినిమా హిట్ అయినా అది ఎక్కువగా అల్లు అర్జున్ ఖాతాలోకి పోయింది. బెల్లంకొండతో సినిమా తరువాత బోయపాటి సినిమా ఏమిటి? ఏ హీరోతో అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. ఏ హీరో కూడా రుమాలు వేసినట్లు వార్తలు లేవు. అదే కొరటాల శివ, సుకుమార్ , త్రివిక్రమ్ ఇలాంటి డైరక్టర్లంతా ఓ సినిమా చేస్తుండగానే మరో సినిమా ఫిక్స్ అయిపోతోంది.
కానీ బోయపాటి అంత పెద్ద హిట్ ఇచ్చినా ఇంతవరకు ఏ హీరో పేరు లైన్ లోకి రాలేదు. అంటే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా కూడా హిట్ కొట్టి తీరాలి. అప్పుడే బండి స్మూత్ గా సాగిపోతుంది. సో ఇవన్నీ కలిసి బోయపాటిపై అదనపు భారం వేస్తున్నాయి. అయినా ఈ భారాలు బోయపాటికి ఏపాటి? సులువుగానే మోసేస్తారు.