ఆ బూతు సినిమా అప్పుడే లీకైందా.?

బాలీవుడ్‌లో ఈ మధ్య ఏ సినిమా విడుదలైనా, 'ఆన్‌లైన్‌ లీకైంది' అన్న మాట ఎక్కువగా విన్పిస్తోంది. ఈ మధ్యకాలంలో 'ఉడతా పంజాబ్‌' సినిమా విడుదలకు ముందు లీకై సంచలనం సృష్టిస్తే, మొన్నీమధ్యనే వచ్చిన 'సుల్తాన్‌'…

బాలీవుడ్‌లో ఈ మధ్య ఏ సినిమా విడుదలైనా, 'ఆన్‌లైన్‌ లీకైంది' అన్న మాట ఎక్కువగా విన్పిస్తోంది. ఈ మధ్యకాలంలో 'ఉడతా పంజాబ్‌' సినిమా విడుదలకు ముందు లీకై సంచలనం సృష్టిస్తే, మొన్నీమధ్యనే వచ్చిన 'సుల్తాన్‌' సినిమా కొంత భాగం లీకవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 'ఉడతా పంజాబ్‌' లీకేజీకి సెన్సార్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ పంకజ్‌ నిహ్లానీ కారణమంటూ పెద్దదుమారమే చెలరేగిందనుకోండి.. అది వేరే విషయం. 

తాజాగా, మరో బాలీవుడ్‌ సినిమా విడుదలకు ముందే లీకవడంతో ఆ చిత్ర నిర్మాత చేసేదేం లేక, సినిమా రిలీజ్‌ని ఓ వారం ముందుకు జరిపేయాల్సి వచ్చింది. ఆ సినిమా ఇంకేదో కాదు, పచ్చి బూతు సినిమాగా వార్తల్లోకెక్కిన 'గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ'. తొలుత వచ్చిన 'మస్తీ'లో ఓ మోస్తరు బూతు కంటెంట్‌ వుంటే, 'గ్రాండ్‌ మస్తీ'లో అడల్ట్‌ కంటెంట్‌ ఇంకాస్త పెరిగింది. 'గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ'లో అడల్ట్‌ కంటెంట్‌ని తారాస్థాయికి తీసుకెళ్ళారు. 

రితీష్‌ దేశ్‌ముఖ్‌, వివేక్‌ ఒబెరాయ్‌, ఆఫ్తాబ్‌ శివదాసాని ఈ చిత్రంలో హీరోలు కాగా, ఊర్వశీ రౌతేలా, పూజా బోస్‌, మిస్తీ చక్రవర్తి, శ్రద్ధా దాస్‌ ఫిమేల్‌ లీడ్స్‌. ఇంద్రకుమార్‌ దర్శకత్వంలో రూపొందింది ఈ చిత్రం. అయితే, సినిమా ఆన్‌లైన్‌లో లీక్‌ అవడంపై చిత్ర యూనిట్‌ పెదవి విప్పడంలేదు. ఎడిటింగ్‌ టేబుల్‌ దగ్గరే సినిమా లీక్‌ అయ్యిందన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. మరోపక్క, ఇదో పబ్లిసిటీ స్టంట్‌ అంటూ బాలీవుడ్‌ సినీ జనం కొట్టి పారేస్తున్నారు.