‘జనతా గ్యారేజ్‌’కి లీకేజ్‌ టెన్షన్‌.?

'జనతా గ్యారేజ్‌' టీజరొచ్చింది.. అంతేనా, 'జనతా గ్యారేజ్‌'లో ఎన్టీఆర్‌ డాన్సులూ బయటకొచ్చేశాయ్‌. షాకింగ్‌ న్యూసే ఇది. అవును, 'జనతా గ్యారేజ్‌'కి సంబంధించి ఓ పాట ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అందులో ఎన్టీఆర్‌ డాన్స్‌ మూమెంట్స్‌…

'జనతా గ్యారేజ్‌' టీజరొచ్చింది.. అంతేనా, 'జనతా గ్యారేజ్‌'లో ఎన్టీఆర్‌ డాన్సులూ బయటకొచ్చేశాయ్‌. షాకింగ్‌ న్యూసే ఇది. అవును, 'జనతా గ్యారేజ్‌'కి సంబంధించి ఓ పాట ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అందులో ఎన్టీఆర్‌ డాన్స్‌ మూమెంట్స్‌ అదరహో అనేలా వున్నాయంటూ ప్రచారం జోరుగా షికారు చేస్తుండడం గమనార్హం. 

తమ అభిమాన హీరో.. కొత్త సినిమాలో డాన్సులు దుమ్ము రేపేశాడని అభిమానులు ఆనందించే సందర్భం కాదిది. టెన్షన్‌ పడాల్సిన సమయం. ఎందుకంటే, లీకయ్యింది ఒక్క పాటలోని కొంత భాగమేనా.? లేదంటే, సినిమా మొత్తమా.? అన్నదీ ఆలోచించుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమకి ఈ లీకులు కొత్త కాదు. 'అత్తారింటికి దారేది' సినిమా విషయంలో ఏం జరిగిందో చూశాం.! 

అన్నట్టు, ఇక్కడో విషయం ప్రస్తావించుకోవాలి. షూటింగ్‌ స్పాట్‌లోనూ, ఎడిటింగ్‌ టేబుల్‌ దగ్గరా.. ఇలా చాలా సందర్భాల్లో 'ఔత్సాహికులు' తమ 'పనితనం' ప్రదర్శించేస్తుంటారు. అక్కడే వస్తోంది సమస్య అంతా. అదే సమయంలో, చీప్‌ పబ్లిసిటీ కోసం కూడా ఇలాంటి జిమ్మిక్కులు జరిగిన సందర్భాలున్నాయి. దాంతో, లీకేజీ విషయంలో చిత్ర యూనిట్‌పై జాలి పడాలా.? వద్దా.? అన్నదానిపైనా కన్‌ఫ్యూజన్‌ మామూలే. 

ఏదిఏమైనా, ఒకప్పుడు సినిమాని పైరసీ పీడించేది.. ఇప్పుడు పైరసీతోపాటు ఈ లీకేజీలు కూడా ఏడిపిస్తున్నాయి. లీకేజీలందు పబ్లిసిటీల లీకేజీలు వేరయా.. అని ఎవరన్నా అంటే, అది తప్పు.. అని అనలేని పరిస్థితి.