మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా అంటే బయ్యర్లు పోటీ పడడం కామన్. కానీ ఓవర్ సీస్ లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమాను ఓన్ రిలీజ్ చేసే దిశగా ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఓవర్ సీస్ లాభాలు ఎక్కువ వస్తాయన్న ఉద్దేశంతో ఓన్ రిలీజ్ చేయడం లేదు. వారు అనుకున్న రేటు రాక ఓన్ రిలీజ్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
చిరు 150 వ సినిమా కత్తిలాంటోడు కు ఓవర్ సీస్ రైట్ల కోసం భారీ మొత్తాన్ని నిర్మాతలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఆ మొత్తం ఇంతా అంతాకాదు..శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ల రేటు కన్నా ఎక్కువని తెలుస్తోంది. అయితే వివి వినాయక్ కు ఓవర్ సీస్ మార్కెట్ అంతగా లేదని, చిరు మార్కెట్ కూడా గతంలో ఓకె కానీ ఇప్పుడు ఎలా వుంటుందో అంచనా లేదని బయ్యర్లు వెనుకంజ వేస్తున్నారట.
నిర్మాతలు ఆశిస్తున్నదానికి, బయ్యర్లు అడుగుతున్నదానికి అస్సలు పొంతన లేదట. దాంతో ఇలా కాదని, ఎవరో ఒకర్ని తెరముందు, తాము అన్న రేటుకే కొన్నట్లు చూపించి, ఓన్ రిలీజ్ చేసుకుందామని చిరు తనయుడు చరణ్ భావిస్తున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అలా అయితే పరువు దక్కుతుంది. ఎన్ని పైసలు వస్తే అన్నే వస్తాయి.